అగ్రరాజ్యం అమెరికాలో బొమ్మలు అనగానే గుర్తొచ్చేది, చైనా, జపాన్, తైవాన్, కొరియా దేశాలు మాత్రమే. ప్రపంచంలో ఉత్పత్తయ్యే బొమ్మల్లో, దాదాపు 90 శాతం ఈ దేశాల నుంచే ఉత్పత్తి అవుతుంది. ఇక చైనా విషయానికి వస్తే, మార్కెట్లో దీని వాటా, దాదాపు 75శాతం పైమాటే. అయితే ఇప్పుడిప్పుడే మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ పేరిట అనేక పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. తద్వారా ఈ టాయ్స్ పరిశ్రమలో కూడా మంచి గ్రోత్ లభించే అవకాశం కనిపిస్తోంది.