Business Ideas: రోజుకు మూడు, నాలుగు గంటలు కష్టపడితే చాలు, 6 నెలల్లో రూ. 10 లక్షలు వెనుకోసుకోవచ్చు..

Published : Jan 02, 2023, 04:25 PM IST

వ్యాపారం చేయాలనుకుంటున్నారా, అయితే చక్కటి వ్యాపార ఐడియా కోసం ఆలోచిస్తున్నారా, ఇక  ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేశాం.  మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే  వెంటనే  ఈ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. 

PREV
16
Business Ideas: రోజుకు మూడు, నాలుగు గంటలు కష్టపడితే చాలు, 6 నెలల్లో రూ. 10 లక్షలు వెనుకోసుకోవచ్చు..

నగరంలో జనాభా పెరిగేకొద్దీ,  వీరికి నిత్యావసరాల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది.  ఎందుకంటే దాదాపు ఒక కోటి పై గల  హైదరాబాద్ లాంటి మహానగరానికి,  కూరగాయలు,  పాలు,  లాంటి నిత్యవసర వస్తువులు  ప్రతిరోజు  కొన్ని టన్నుల కొద్దీ అవసరమవుతుంది. అందుకే నిత్యవసర వస్తువులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.  ముఖ్యంగా కుటుంబాలు,  హోటళ్లు,  రెస్టారెంట్లు,  ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,  కర్రీ పాయింట్లు, ఇలా  ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసరం కూరగాయలు. 

26
Vegetables to include in your daily diet in winters

 ఎందుకంటే అన్నం తో పాటు కూరగాయలు కూడా చాలా అవసరం అవుతాయి.  కేవలం అన్నం ఉడికించుకోని మనం తినలేము. అందుకే, అందులోకి ఏదో ఒక కూరగాయ అవసరం అవుతుంది.  అందుకే మార్కెట్లో ఎన్ని టన్నుల కూరగాయలు అందుబాటులో ఉంచినా, జనం కొద్ది గంటల్లోనే ఖాళీ చేసేస్తుంటారు.  ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 
 

36
vegetables

 ఇక ఈ బిజినెస్ విషయానికి వస్తే,  కూరగాయలు పండించే రైతులకు నగరాల్లో ఇది చాలా పెద్ద సమస్య.  రైతు బజార్లను ఏర్పాటు చేసుకున్నప్పటికీ,  మెజారిటీ కూరగాయలను దళారులే విక్రయిస్తుంటారు.  అయితే దళారులు రైతులకు సరైన లాభం చెల్లించరు అనే పేరు ఉంది.  కనుక మీరు కాస్త వినూత్నంగా ఆలోచించ గలిగితే, ఈ  కూరగాయల బిజినెస్ లోకి  మీరు కూడా ప్రవేశించవచ్చు.  అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.  నగరానికి సమీపంలో  వ్యవసాయ క్షేత్రాల్లో  కూరగాయలు పండించే రైతులతో కలిసి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. నేరుగా వద్దనే మీరు కూరగాయలను కొనుగోలు చేసి,  నగరంలోని రిటైల్ వ్యాపారులకు,  తోపుడుబండ్ల వాళ్లకు,  విక్రయించడం వల్ల,  మంచి కమిషన్ తో పాటు లాభం వస్తుంది. 

46
Vegetables

ఈ పని కోసం మీరు రోజుకు మూడు నాలుగు గంటలు కష్టపడితే చాలు. ఇందుకోసం మీరు ఒక గోడౌన్ మెయిన్ టెయిన్ చేయాలి. ఈ గోడౌన్ లో  మీరు ఏసీ సౌకర్యం కూడా పెట్టుకోవచ్చు.  తద్వారా కూరగాయలు పాడవ్వవు.  అలాగే రైతుల వద్ద నుంచి కూరగాయలు సేకరించడానికి  2, 3 వాహనాలను ఏర్పాటు చేసుకోవాలి. డిమాండ్ ను బట్టి కమర్షియల్ వాహనాలను అద్దెకు తీసుకోవాలి. 

56
Vegetables

రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి చెల్లించడం ద్వారా, మీకు  వ్యవసాయ క్షేత్రం వద్ద అతి తక్కువ ధరకే,  కూరగాయల పంటలు లభిస్తాయి.  అలాగే ఈ కూరగాయలను రైతుల వద్ద నుంచి నేరుగా చేర్చుకొని,  వాటిని స్టోర్ చేసుకుంటే మంచిది.  ఈ కూరగాయలను రిటైల్ వ్యాపారులకు, తోపుడు బండ్ల వారికి విక్రయించడం ద్వారా,  మీరు చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.

66

అలాగే కూరగాయలను ప్యాక్ చేసి, వీధుల్లో ఏర్పాటు చేసే, సంతల్లోనూ, సూపర్ మార్కెట్లకు విక్రయించడం ద్వారా, నీకు మరింత ఎక్కువ లాభం  పొందే వీలుంది. ఇక కర్రీ పాయింట్లు, హాస్టళ్లు, మెస్సులు, రెస్టారెంట్లకు కావలసిన కూరగాయలను సప్లై చేయడం ద్వారా మీకు నిరంతరం ఆర్డర్లను పొందే అవకాశం దక్కుతుంది. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, గోడౌన్ అద్దె, వాహనాలు, ఏసీ కరెంటు బిల్లులకు ఖర్చుచేయాల్సి ఉంటుంది. సహాయకులను జీతం ప్రాతిపదికన పెట్టుకోవాలి. ఇక ఆదాయం విషయానికి వస్తే కనీసం నెలకు రూ. 2 లక్షల వరకూ సంపాదించే వీలుంది. 

Read more Photos on
click me!

Recommended Stories