Business Ideas: అతి తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే, రూపాయికి 10 రూపాయలు లాభం పొందే చాన్స్..

First Published Jan 2, 2023, 11:00 AM IST

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీకు తగిన ఉద్యోగం లభించడం లేదని బాధపడుతున్నారా,  అయితే ఏ మాత్రం కూడా  మీ సమయాన్ని వృధా చేసుకోకండి.  చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని డబ్బు సంపాదించడం ద్వారా, మీరు ఉద్యోగం చేసి సంపాదించే కన్నా ఎక్కువ డబ్బులు వెనకేసుకోవచ్చు.  అది ఎలాగో తెలుసుకుందాం. 

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరిగింది. కరోనా నేపథ్యంలో  ఇమ్యూనిటీ పెంచుకునేందుకు  ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.  అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు జనం వెనకాడటం లేదు.  మీరు కూడా డబ్బు  సంపాదించాలి అనుకుంటే,  మంచి హెల్దీ ఫుడ్ విక్రయించడం ద్వారా  చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది. 

dry fruits for health

ప్రస్తుతం డాక్టర్లు డ్రైఫ్రూట్స్ తినమని ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.  డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషక విలువలు ఉంటాయి.  అలాగే ఇందులో కొలెస్ట్రాల్ ను తగ్గించే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.  అందుకే డ్రైఫ్రూట్స్ తినమని డాక్టర్లు సూచిస్తున్నారు.  మీరు కూడా డ్రైఫ్రూట్స్ విక్రయించడం ద్వారా దీని వ్యాపార అవకాశంగా మలుచుకుని  డబ్బు సంపాదించే అవకాశం ఉంది. 

dry fruits

అయితే మిక్స్‌డ్  డ్రైఫ్రూట్స్ ను అందుబాటులో ఉంచడం ద్వారా జనం వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.  మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్  మీరే స్వయంగా ప్యాక్ చేసి విక్రయించడం ద్వారా చక్కటి లాభం పొందే అవకాశం ఉంది.  ముందుగా ప్రారంభించడానికి  ఏమేం కావాలో తెలుసుకుందాం. 
 

ముందుగా డ్రైఫ్రూట్స్ ను మీరు హోల్ సేల్  మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  దేశవ్యాప్తంగా డ్రై ఫ్రూట్స్ ను  అనేక హోల్ సేల్ మార్కెట్ లలో విక్రయిస్తారు.  మీరు పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే.  నేరుగా రైతుల వద్ద కూడా డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తే, మీకు మరింత తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ లభించే  అవకాశం ఉంది. ఉదాహరణకు  మీరు జీడిపప్పు కొనాలి అనుకుంటే  ప్రకాశం జిల్లాలోని వేటపాలెం, శ్రీకాకుళంలోని పలాస ప్రాంతాల్లో రైతులు జీడిమామిడి తోటలు సాగు చేస్తారు. ఇక్కడి నుంచి మీరు జీడిపప్పును అతి తక్కువ ధరకే కొనే వీలుంది.  అలాగే మహారాష్ట్రలోని నాసిక్,  చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎండు ద్రాక్షను తయారుచేస్తారు. 
 

అలాగే ఢిల్లీలోని  చాందినీ చౌక్ ప్రాంతంలోని  ఖారీ బౌలి  మార్కెట్ లో అతి తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి.  వీటిని మీరు ట్రైన్ ద్వారా వెళ్లి తెచ్చుకోవచ్చు.  తద్వారా మీకు అతి తక్కువ ధరకే  డ్రై ఫ్రూట్స్ పొందే వీలుంది.ఆ తర్వాత మీరు చేయవలసిందల్లా ప్యాకింగ్ మాత్రమే.  మీరు డ్రైఫ్రూట్స్ ను ప్యాక్ చేసేందుకు. ముందుగా డ్రై ఫ్రూట్స్  జీడిపప్పు,  బాదం, పిస్తా,  గుమ్మడి గింజలు,  ఖర్జూరం,  కిస్మిస్, వాల్ నట్ వంటివి సమపాళ్ళలో లో, కలుపుకొని పావు కేజీ అరకేజీ ఒక కేజీ ప్యాకెట్లు గా పెట్టుకోవాలి.  వీటిని మీరు మార్కెట్లో అరకేజీ 500 చొప్పున విక్రయించినా చాలా లాభం వస్తుంది.  ఎందుకంటే  డ్రైఫ్రూట్స్ ఒక్కోటి ఒక్కో ధర ఉంటాయి. కావున మీరు లాభం మార్జిన్ చూసుకొని ప్యాక్ చేసుకుంటే మంచిది.  అలా అని ఏదైతే తక్కువ ధర ఉందో దానితోనే కస్టమర్లు కొనడానికి కోరారు. అన్ని డ్రైఫ్రూట్స్ సమపాళ్లలో కలిపి అమ్మినా మీకు మంచి లాభం వస్తుంది. 

మీరు హోల్సేల్గా ఈ ప్యాకెట్లను విక్రయించడం కన్నా నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం పొందే వీలుంది. 100 గ్రాములు 50 గ్రాములు చొప్పున ప్యాకెట్లు చేసి విక్రయించడం ద్వారా మరింత ఎక్కువ లాభం పొందే వీలుంది.  ఈ ప్యాకెట్లను రిటైల్ మార్కెట్లో కూడా విక్రయించవచ్చు.
 

click me!