Business Ideas: కేవలం రూ.50 వేల పెట్టుబడితో, ఈ బిజినెస్ చేస్తే నెలకు. రూ. 1 లక్ష సంపాదించే చాన్స్..

First Published Sep 1, 2022, 12:28 PM IST

ఫుడ్ బిజినెస్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ వ్యాపారం అనే చెప్పాలి.ఎందుకంటే ఇందులో లాభం మార్జిన్ ఎక్కువగా ఉంటుంంది. అయితే క్వాలిటీ, నీట్ నెస్, రుచి మెయిన్ టెయిన్ చేస్తే చాలు చక్కటి ఆదాయం మీకు సొంతం అవుతుంది. ప్రస్తుతం ప్రజలు తమ ఖాళీ సమయాల్లో సరదాగా స్నాక్స్ తినేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి స్నాక్స్ వ్యాపారం గురించి తెలుసుకుందాం. 

గ్రిల్ సాండ్ విచ్ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో కూడా ప్రజలు బాగా తినేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి గ్రిల్ సాండ్ విచ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రిల్ సాండ్ విచ్ కోసం మీకు కావాల్సింది. గ్రిల్ సాండ్ విచ్ తయారీ విధానం తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల్లో  బేకరీ శిక్షణా తరగతులు హాజరు అయితే మంచిది. లేదా ఎవరైన అనుభవం ఉన్న వారి వద్ద నుంచి గ్రిల్ సాండ్ విచ్ తయారీ కోసం శిక్షణ పొందితే సరిపోతుంది. 

గ్రిల్ సాండ్ విచ్ కోసం మీకు కావాల్సింది. మీకు Commercial sandwich grill మెషీన్ దీని ధర సుమారుగా రూ. 8 వేల నుంచి రూ. 20 వేల వరకూ ఉంటుంది. మీ గిరాకీని బట్టి రెండు మెషీన్లు కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఇక అలాగే మీరు స్టాల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. మాల్స్, సినిమా థియేటర్లు, రద్దీ ఉండే షాపింగ్ ఏరియాల్లో ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అలాగే ఆఫీసులు, విద్యాసంస్థల్లోని కాంటిన్లలో కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 

ఇక స్టాల్ ఏర్పాటుకు మీకు స్టెయిన్ లెస్ స్టీల్ ఫుడ్ స్టాల్ కావాలి. దీన్ని మీకు అనుకూలంగా డిజైన్ చేయించుకోండి. ఇందులో కరెంట్, మీ మీ ముడిసరుకు దాచుకునేందుకు వీలుగా డిజైన్ ఉండాలి. అలాగే లైటింగ్ బ్రాండ్ నేమ్ కనిపించేలా గ్లో సైన్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి.అలాగే గ్రిల్ సాండ్ విచ్ ఏర్పాటు కోసం స్థానిక మునిసిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పెట్టుబడి కోసం ముద్రా రుణం పొందవచ్చు. 

అంతేకాదు మీరు సాండ్ విచ్ వ్యాపారం ద్వారా లాభం పొందాలి అనుకుంటే, ముందుగా సాండ్ విచ్ బ్రెడ్ ప్యాకెట్లను తయారీ దారు నుంచి నిరంతరం సప్లై పొందే ఏర్పాటు చేసుకోవాల. వీలైతే, అయితే తాజా బ్రెడ్ వాడాలి. నాణ్యత మెయిన్ టెయిన్ చేయాలి. ఇక సాస్, కూరగాయలు, బల్క్ గా కొనుగోలు చేసుకోవాలి.

సాధారణంగా ఒక చికెన్ గ్రిల్ సాండ్ విచ్ ధర, రూ. 100 వరకూ ఉంది. ఇక వెజ్ గ్రిల్ సాండ్ విచ్ ధర రూ.60 వరకూ వసూలు చేయవచ్చు. ఇక ఎగ్ సాండ్ విచ్, పన్నీర్, మష్రూమ్ వంటి వెరైటీలను తయారు చేసి విక్రయించవచ్చు. ఇక దీనిపై కనీసం మనకు 50 శాతం వరకూ లాభం మార్జిన్ పొందవచ్చు. ఈ లెక్కన మనకు రోజుకు 100 సాండ్ విచ్ లను అమ్మినా రోజుకు రూ.5000 వరకూ లాభం పొందవచ్చు. అయితే ఈ లాభం పెట్టుబడి కలపకుండా వచ్చిందని గమనించాలి. ఈ లెక్కన నెలకు రూ. 1 లక్ష పైనే సంపాదించుకునే వీలుంది. 

click me!