Business ideas: కేవలం రూ. 50 వేల పెట్టుబడితో, నెలకు రూ.90 వేల బిజినెస్ ఇదే, పెట్టుబడి జస్ట్ నెలకే రిటర్న్..

First Published Aug 31, 2022, 11:14 PM IST

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే, మీకు మంచి వ్యూహం ఉంటే చాలు చక్కటి వ్యాపారం చేసే అవకాశం ఉంది. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో వ్యాపారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాలను అందిస్తోంది. ఈ రుణాలను ఉపయోగించి అనేక మంది ఉపాధిని పొందుతున్నారు. మీరు కూడా అలాంటి ఉపాధి పొందాలని చూస్తున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ కథనం ద్వారా ఓ వ్యాపార ఐడియాను తెలుసుకుందాం. 
 

ముద్రా రుణాలను కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అందిస్తోంది. అది కూడా ప్రతీ ప్రభుత్వ బ్యాంకు బ్రాంచీల్లో లభ్యం అవుతున్నాయి. ఇందుకోసం ఎలాంటి హామీ అవసరం లేదు. రూ. 10 నుంచి రూ. 10 లక్షల వరకూ రుణాలను పొందే వీలుంది. ఇందులో శిశు రుణాల పేరిట రూ. 50 వేల వరకూ రుణాలను అందిస్తున్నారు. అయితే శిశు రుణాలతో కూడా మీరు జీవనోపాధిని పొందవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. 
 

ఈ మద్య కాలంలో ఆహార పరిశ్రమకు మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తమ బిజీ లైఫులో ఆహారం వండుకునేందుకు సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి చక్కటి ఆహారం అందిస్తే చాలు మీకు మంచి వ్యాపారం దక్కుతుంది. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. 
 

ఈ మధ్య కాలంలో రోటీ రోల్స్ స్టాల్స్ ను  మాల్స్, సినిమా థియేటర్స్, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఎక్కువగా చూస్తున్నాం, ప్రజలు తమ బిజీ లైఫులో ఒక దగ్గర నిలబడి తినే తీరిక లేని వారు ఈ రోల్స్ కొనుగోలు చేసుకొని తింటూ ప్రయాణం చేస్తారు. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. 

ఇందుకోసం మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ స్టెయిన్ లెస్ స్టీల్ స్టాల్ చేయించుకోవాలి. దీనికి గ్యాస్ స్టౌ, అలాగే తవా ( పెనం) ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు చేయాల్సింది. ముందుగా మైదా పిండితో రోటీ చేసుకోవాలి. దాన్ని పూర్తిగా కాల్చకుండా పెనంపై సగం కాల్చి వాటిని పెట్టుకోవాలి. ఇక చికెన్ రోల్స్ కోసం చికెన్ కర్రీ, ఎగ్ రోల్స్ కోసం ఎగ్స్, వెజ్ రోల్స్ కోసం పన్నీర్, లేదా స్వీట్ కార్న్, లేదా పుట్ట గొడుగులు, ఆలు, లాంటి కర్రీస్ సిద్దం చేసుకోవాలి. 

ఇక మీరు చేయాల్సింది. పెనంపై మీరు సగం కాల్చిన రోటీని కాస్త నూనె వేసి కాల్చాలి. దానిపై నాన్ వెజ్ ఆర్డర్ కోసం చికెన్ కర్రీ, వెజ్ ఆర్డర్ అయితే వెజ్ కర్రీ వేసి, దానిపై సాస్ లేదా మయనేజ్ వేసి చపాతీని రోల్ చేసి దాన్ని ఒక టిష్యూ పేపర్ లో చుట్టి ఇవ్వాలి. దీని ధర విషయానికి వస్తే ఒక చికెన్ రోల్ ధర రూ. 50 నుంచి 70 వరకూ ఉంటుంది. ఇక ఎగ్, లేదా వెజ్ రోల్స్ అయితే రూ. 30 నుంచి రూ. 50 వరకూ చార్జ్ చేస్తారు. ఇందులో మీకు చాలా లాభం ఉంటుంది. 
 

ఎలాగంటే ఒక కిలో చికెన్ లేదా పన్నీర్  కర్రీ కోసం మీరు చేసే ఖర్చు సుమారు 200 రూపాయలు అనుకుంటే, ఆ కిలో కర్రీతో 50 గ్రాముల చొప్పన కనీసం 20 రోల్స్ చేయవచ్చు. అంటే 20 రోల్స్ X రూ.50=రూ.1000 రూపాయలు సంపాదించవచ్చు. అంటే 800 రూపాయల లాభం మీకు దక్కుతుంది. ఈ లెక్కన రోజుకు కనీసం రూ. 3000 వరకూ సంపాదించుకోవచ్చు. ఈ లెక్కన ఆలోచిస్తే మీరు రూ. 3000x 30 రోజులు= రూ. 90,000 వరకూ సంపాదించుకోవచ్చు. 
 

ఇకపెట్టుబడి విషయానికి వస్తే రూ. 50 నుంచి రూ. 1 లక్ష రూపాయల వరకూ అవుతుంది. అంటే మీ పెట్టుబడి కేవలం రెండు, మూడు నెలల్లోనే వచ్చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.  

click me!