Business Ideas: ఆఫీసు లేదు, బాసు లేడు, మీకు మీరే బాసు, ఇష్టం వచ్చినప్పుడు పనిచేసుకోండి, నెలకు లక్షల్లో ఆదాయం..

First Published Sep 1, 2022, 12:26 AM IST

బిజినెస్ చేయడమే మీ కలా అయితే చాలా బిజినెస్ ఐడియాలు మీకు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రాక్టికల్ గా అవి వర్కౌట్ అవుతాయా, కాదా అనే సందేహం మీకు ఉండవచ్చు. కానీ మీరు కష్టపడితే చాలు ఎలాంటి వ్యాపారం అయినా సరే సులభమే అని చెప్పాలి. అయితే వ్యాపారానికి పెద్దగా చదువు అవసరం లేదు. తెలివితేటలు, క్రమశిక్షణఉంటే చాలు చక్కగా రాణించవచ్చు. అలాంటి వ్యాపారాలు ఏమున్నాయో చూద్దాం.

Loadking OPTIMO LCV truck

ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో చక్కటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతకు ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలకు లాస్ట్ మైల్ డెలివరీ అనేది ఒక చాలెంజ్ అనే చెప్పాలి. కస్టమర్ కు సరుకును చేరవేయడం అనే లాస్ట్ మైల్ సర్వీసుకు చాలా డిమాండ్ ఉంది. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 

Tata Ace Gold Petrol CX

మీరు మంచి డ్రైవర్ అయితే చాలు, ముద్ర రుణం ద్వారా మీరు ఒక మినీ ట్రక్ వాహనం  కొనుగోలు చేసుకుంటే చాలు ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేల్యాండ్, మారుతి సంస్థలు ఈ మినీట్రక్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ధర కనిష్టంగా 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఉన్నాయి. కెపాసిటీని బట్టి వీటి ధర మారుతూ ఉంటుంది. ః

tata ace2

అయితే ప్రస్తుతం నగరాల్లో ఈ మినీ ట్రక్కులకు చక్కటి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ కామర్స్ సంస్థలకు తమ సరుకులను ఒక పాయింట్ దగ్గర నుంచి మరో పాయింటుకు చేర్చేందుకు వీటినే నమ్ముకున్నాయి. ఇక అలాగే ఎలక్ట్రానిక్స్, గ్రాసరీ ఐటెమ్స్ రవాణాకు కూడా ఈ మినీట్రక్కులకే డిమాండ్ ఉంది. 

మీరు లాజిస్టిక్స్ వ్యాపారంలో రాణించాలంటే సొంత వాహనం ద్వారా అయితే చక్కటి లాభం సంపాదించుకోవచ్చు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది,. మీరు ఈ వాహనాలను బ్యాంకు రుణాల ద్వారా పొందవచ్చు. ఇందుకోసం ఎందుకంటే బ్యాంకులు ఈ రుణాలను విరివిగా ఇస్తాయి. అంతేకాదు ముద్రారుణం ద్వారా కూడా ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. మీ ఆదాయం పెరిగే కొద్దీ నెల వాయిదా పెద్దగా భారం కాకపోవచ్చు. అయితే మీరు స్వంతంగా డ్రైవర్ అయితే మరింత లాభం ఉంది.

ఇక మీరు వాహనాన్ని పోర్టర్ లాంటి వెబ్ సైట్ లో పెట్టడం ద్వారా మీరు ఆటోమేటిగ్గా బేరాలు వస్తాయి. అలాగే కంపెనీలకు అటాచ్ చేయడం ద్వారా కూడా మీకు మంచి ఆదాయం వస్తుంది. పాలు, చేపలు, చికెన్, ఇతర సరుకుల రవాణాకు ఈ మినీ ట్రక్కుల డిమాండ్ చాలా ఉంది. 

ఇక ఈ మినీ ట్రక్కులను కొనుగోలు చేసిన తర్వాత మీరు ఆర్టీఏ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి. అలాగే లోడు విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే చాలాన్లతో మీ ఆదాయానికి గండి పడవచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ మినీట్రక్కులకు డిమాండ్ పెరుగుతోంది. 

అంతేకాదు మీరు కూల్ డ్రింక్స్, లేదా ఇతర సరుకుల డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకుంటే మీ సొంత వాహనం ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేపడితే మరింత అదనపు ఆదాయం దక్కుతుంది. 

click me!