Business Ideas: మహిళలు ఇళ్లు దాటకుండా విదేశాల్లో సైతం వేలాది డాలర్లు సంపాదించే బిజినెస్ ఇదే..ఆశ్చర్యపోవడం ఖాయం

First Published | Aug 10, 2023, 3:12 PM IST

మహిళలు వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేయండి తద్వారా మీరు ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగు వేయవచ్చు.  మీరు ఇంటి వద్ద ఉండి కూడా మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఎంచక్కా వ్యాపారం చేయవచ్చు తద్వారా ప్రతినెల లక్షల్లో ఆదాయం పోతే అవకాశం ఉంది అలాంటి ఓ మంచి బిజినెస్ కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 ప్రస్తుత కాలంలో మహిళలు ఇంటి వద్ద ఉండే పలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంది ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి బిజినెస్ లకు  చక్కటి ఆస్కారం ఉంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్లను పొందుతూ బిజినెస్ చేయవచ్చు.  ముఖ్యంగా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు పొందేందుకు ప్రస్తుత ఆన్లైన్ వ్యాపారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.  విదేశాల్లో డిమాండ్ ఉన్నటువంటి  చక్కటి వ్యాపారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

విదేశాలతో చేతితో చేసినటువంటి హస్తకళలకు చాలా డిమాండ్ ఉంది.  ముఖ్యంగా కొయ్య బొమ్మలు.  కొండపల్లి బొమ్మలు,  యాంటిక్ పెయింటింగ్స్.  పురాతన చిత్రకళ,  కుండల మీద పెయింటింగ్స్,  ఇతర సాంప్రదాయ హస్తకళలకు విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది దీని ఉపయోగించుకోవడం ద్వారా  మీరు డాలర్లలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.  ముఖ్యంగా విదేశాల్లో ఇలాంటి చేతితో చేసిన హస్తకళలకు చాలా డిమాండ్ ఉంది.  ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 


 ముందుగా ఓ వెబ్ సైట్ ప్రారంభించండి.  ఈ వెబ్సైట్ ద్వారా మీరు  దేశంలోనే వివిధ ప్రాంతాలకు చెందిన హస్త కళల  వస్తువులను లిస్ట్ చేయండి.  అనంతరం మీరు ఆర్డర్లు పొందిన తర్వాత.  ఆ హస్తకళల నిపుణుల వద్ద నుంచి కళాఖండాలను కొనుగోలు చేయవచ్చు.  వాటిని జాగ్రత్తగా అంతర్జాతీయ కొరియర్ సర్వీసుల ద్వారా డెలివరీ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

 ఉదాహరణకు కొండపల్లి కొయ్య బొమ్మలకు  ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.  వీటిని విదేశాల్లో సైతం చాలా బాగా ఇష్టపడతారు.  ముఖ్యంగా బుద్ధ ప్రతిమ కొనుగోలు చేసేందుకు దక్షిణాసియా దేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది చైనా,  జపాన్,  కొరియా లాంటి దేశాల్లో బుద్ధుడి ప్రతిమలను కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.  అలాంటి ప్రతిమలను మీరు స్థానిక కళాకారుల వద్ద నుంచి తయారు చేయించి ఆన్లైన్లో లిస్టు చేసి విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

 ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది.  దాంతోపాటు జీఎస్టీ నెంబర్ కూడా పొందాల్సి ఉంటుంది.  అలాగే విదేశీ ఎగుమతులకు సంబంధించిన అనుమతులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.  ఇక మీ వెబ్సైట్ ప్రచారం కోసం యూట్యూబ్ సోషల్ మీడియా వేదికని ఉపయోగించుకుంటే మంచిది. . అమెరికా,  యూరప్,  చైనా, జపాన్, కొరియా  వాటి దేశాల్లో భారతీయ హస్త కళలకు చాలా డిమాండ్ ఉంది. 
 

 అలాగే మీ వెబ్సైట్ ఇతర విదేశీ భాషల్లో సైతం తర్జుమా అయ్యేలా డిజైన్ చేసుకుంటే మంచిది. ఉదాహరణకు ఫ్రెంచి,  చైనీస్,  అరబిక్,  జపనీస్,  రష్యన్,  లాటిన్  వాటి భాషల్లో మీ వెబ్సైట్ తర్జుమా అయ్యేలా డిజైన్ చేయించుకుంటే మీకు ఇతర అంతర్జాతీయ ఆర్డర్లు కూడా వేగంగా వచ్చే అవకాశం ఉంది.  ఈ బిజినెస్ ద్వారా మీరు కోట్లలో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. 

Latest Videos

click me!