ఇక స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం ద్వారా మీకు డెలివరీ చేసుకునే భారం తప్పుతుంది. కొంత మంది సీనియర్ సిటిజన్స్ సైతం ఈ తరహా థాలీని తినేందుకు ఇష్టపడుతున్నారు. ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో పనిచేసే వారు మీ టార్గెట్ కస్టమర్లుగా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆన్ టైం డెలివరీ, అత్యాశకు పోయి ఎక్కువ మంది నుంచి మంత్లీ సబ్ స్క్రయిబర్లను తీసుకోవద్దు. మీరు ఎంత మందికి డెలివరీ చేయగలరో అంతమంది కస్టమర్లనే తీసుకోండి. రుచి,నాణ్యత, ప్యాకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దు.