Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉంటూనే, విదేశాల్లో సైతం చేయగలిగే వ్యాపారం ఇదే, నెలకు లక్షల్లో ఆదాయం..

First Published Dec 25, 2022, 4:56 PM IST

మహిళలు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా మీరు ఖాళీ సమయాన్ని వృధా కానివ్వకుండా కొద్దిగా కష్టపడితే చాలు మీరు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  దాని కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.  అయితే మీ వ్యాపారం కోసం పెట్టుబడి  ఎలా అని ఆలోచించకండి.  ఎందుకంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర యోజన ద్వారా లక్షలాది రూపాయల రుణాలను పంపిణీ చేస్తోంది.  తద్వారా మీరు మీ వ్యాపారం సక్సెస్ ఫుల్ గా చేసే అవకాశం ఉంది. 

ఇప్పుడు మహిళలు ఇంటి వద్ద ఉంటూనే,  సక్సెస్ ఫుల్ గా రన్ చేసే వ్యాపారం గురించి తెలుసుకుందాం. తెలుగు వారి ఇంట భోజనం అంటే కంచంలో కచ్చితంగా ఉండాల్సిందే నిలవ పచ్చడి.  ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, గోంగూర, పండు మిరపకాయ, అల్లం,  టమాటో పచ్చళ్ళు అంటే  తెలుగువారు ఎంతో ఇష్టంగా తింటారు.  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు  పచ్చళ్లను ప్యాక్ చేసి మరీ తీసుకొని వెళ్లి తింటారు.  అంత డిమాండ్ ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ప్రియా, త్రీ మ్యాంగోస్,  స్వస్తిక్ వంటి బ్రాండ్స్ పచ్చళ్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నాయి. 
 

మీరు కూడా పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించడం ద్వారా,  చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది.  అయితే దీనికి మహిళలు తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తే చాలు,  చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే సాంప్రదాయ పచ్చళ్ల తో పాటు, నాన్వెజ్ పచ్చళ్ల కూడా మంచి డిమాండ్ వుంది.  వీటిని విదేశాలకు సైతం ప్యాక్ చేయించుకొని తీసుకెళ్లి చాలా ఇష్టంగా తింటారు.

మీరు నాన్వెజ్ పచ్చళ్ల వ్యాపారం కూడా  చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అయితే ముందుగా మీరు ఈ పచ్చళ్లను ఏవిధంగా తయారు చేయాలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.  పలు మహిళా ఉపాధి శిక్షణ కేంద్రాలు,  పచ్చళ్ళ తయారీ శిక్షణను అందిస్తున్నాయి.  వాటిలో మీరు తర్ఫీదు పొంది,  మెళకువలను నేర్చుకోవచ్చు.  ఇంట్లో చేసుకునే పచ్చళ్లకు,  మార్కెట్లో కమర్షియల్గా విక్రయించే పచ్చళ్లకు చాలా తేడా ఉంటుంది. 

pickle

ముఖ్యంగా వీటిని నిల్వ చేయడం,  ప్యాకింగ్,  మార్కెటింగ్ చేయడం వంటి విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.  ఇక మీరు పచ్చళ్ల వ్యాపారం చేసేందుకు ముందుగా కావాల్సింది. ఒక శుభ్రమైన ప్రదేశం. అలాగే స్వచ్ఛమైన నూనె,  కారం, ఇతర మసాలా దినుసులు  అవసరం అవుతాయి.  మీరు ఆర్డర్లను పొందడం ద్వారా పచ్చళ్లు తయారు చేసి ప్యాక్ చేసి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చు.  నిలవ పద్ధతిలో విక్రయించాలంటే,  మీరు షాపులకు వెళ్లి హోల్సేల్ ధరలకు విక్రయించాల్సి ఉంటుంది.  లేదా హోటళ్ళు, మెస్ లు  బల్క్ ఆర్డర్లను పొందడం ద్వారా పచ్చళ్లు తయారు చేసే విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చు. 

లేదా మీరే ఇంటివద్ద నలుగురికి కనిపించేలా ఒక బోర్డు తయారు చేయించి,  ఫోన్ నెంబర్ వేసి ప్రచారం చేయడం ద్వారా ఆర్డర్లను సులభంగా పొందవచ్చు.  నాణ్యత, రుచి  మెయింటైన్ చేస్తే  చక్కటి ఆర్డర్లను పొందవచ్చు.  డిజిటల్ మీడియా ద్వారా  పబ్లిసిటీ చేయడం ద్వారా మీరు విదేశాల నుంచి కూడా పచ్చళ్ల ఆర్డర్లను పొందే అవకాశం ఉంది 
 

click me!