Business Ideas: ఉద్యోగం లేదని బాధపడకండి, రోజుకు రూ.5000 సంపాదించగలిగే ఈజీ బిజినెస్ ఇదే..

Published : Dec 23, 2022, 12:56 PM IST

నిరుద్యోగులు ఉద్యోగం లేదని బాధపడవద్దు మనసుంటే మార్గం ఉన్నట్లే కాస్త తెలివితేటలు ఉపయోగించి చొరవ చూపిస్తే చాలు. చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే వీలుంది.  అది ఎలాగో తెలుసుకుందాం.  వ్యాపారం చేయాలంటే కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు.  తెలివితేటలు కూడా చాలా అవసరం.  అప్పుడే మనం వ్యాపార రంగంలో రాణించగలం.   

PREV
15
Business Ideas: ఉద్యోగం లేదని బాధపడకండి, రోజుకు రూ.5000 సంపాదించగలిగే ఈజీ బిజినెస్ ఇదే..

ఫుడ్ బిజినెస్ లో చాలా లాభం ఉంటుంది. ఇందులో ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ.  కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తే మాత్రం  ఈ కెరీర్లో మీరు బాగా రాణించవచ్చు.  ప్రస్తుతం మంచి ట్రెండింగ్లో ఉన్న ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. పానీ పూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు.  ముఖ్యంగా  పట్టణ ప్రాంతాల్లో,  ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ పానీ పూరి బండ్లను పెట్టి జీవితం  గడుపుతుంటారు. 
 

25

మీరు కూడా ఈ పానీపూరి వ్యాపారాన్ని వెరైటీగా ప్రారంభించి,  ప్రతిరోజూ కనీసం 5000 లాభాన్ని పొందే వీలుంది.  అది ఎలాగో తెలుసుకుందాం. సాంప్రదాయ పానీపూరి లను చేతులతో వేస్తారు. పూరీలో కూర పెట్టి నీళ్లలో ముంచి పానీపూరి లను కస్టమర్లకు సర్వ్ చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఎక్కువ మందికి మనము ఒకేసారి సర్వ చేయలేము.  ఇదంతా శ్రమతో కూడుకున్న పద్ధతి. లాభం కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.  అయితే దీనికి పరిష్కారం పానీపూరి మెషిన్.  ఆటోమేటిక్ నాజిల్ ఉన్నా పానీపూరి మిషన్ తో చాలా సులభంగా పరిశుభ్రంగా పానీ పూరీలను సర్వ్ చేయవచ్చు. 
 

35

పానీపూరి మిషన్లో పైన ట్యాంకులో మసాలా నీరు నింపుతారు.  ఈ నీటిని నా ద్వారా పానీ పూరి లో పోస్తారు.  తద్వారా మీరు నీటిలో చేయి పెట్టకుండానే తినే వీలుంది. ఇది చాలా శుభ్రమైన పద్ధతి. అంతేకాదు ఎక్కువ మంది కస్టమర్లకు మీరు పానీ పూరీలను సర్వ్ చేసే వీలుంది. ముఖ్యంగా మాల్స్ అలాగే షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ తరహా పానీపూరి మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. 
 

45
pani puri

పానీ పూరిమిషన్ లను మీరు ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.  ఆన్లైన్లో పానీ పూరి మిషన్ ధర 35 వేల నుంచి ప్రారంభం అవుతోంది.  వివిధ రకాల ఫ్లేవర్లతో మసాలా తయారు చేసుకోవచ్చు.  ఈ తరహా మిషన్లతో రోజుకు కనీసం ఐదు వేల వరకు సంపాదించవచ్చని,  ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులు చెబుతున్నారు. 
 

55

మీరు కూడా ఒక మంచి ప్లేస్ లో పానీపూరి మిషన్ ద్వారా వ్యాపారం ప్రారంభిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అయితే నీటి నాణ్యత విషయంలో, కాంప్రమైస్ కావద్దు,  మినరల్ వాటర్ వాడటం ద్వారా మీరు పెద్ద ఎత్తున కస్టమర్లను పొందే వీలుంది. 

Read more Photos on
click me!

Recommended Stories