మీరు కూడా సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారా అయితే హౌస్, ఆఫీస్ క్లీనింగ్ సర్వీస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ప్రస్తుత కాలంలో పట్టణాల్లోనూ నగరాల్లోనూ విల్లాలు, పెద్ద పెద్ద బంగళాలో, ఫామ్ హౌస్ లు పెరిగిపోతున్నారు. అలాగే నగరాల్లో ఆఫీస్ స్పేస్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. వీటన్నిటికీ ప్రతిరోజు క్లీనింగ్ చేసేందుకు సిబ్బంది ఉన్నప్పటికీ, డెడికేటెడ్ పూర్తిస్థాయి క్లీనింగ్ చేసేందుకు హౌస్ క్లీనింగ్ సర్వీసు వారిని సంప్రదిస్తుంటారు. ఉదాహరణకు ప్రస్తుతం మార్కెట్లో అర్బన్ క్లాప్ లాంటి సంస్థలు, ఇలాంటి సర్వీసులు అందిస్తున్నాయి.