Business Ideas: ఉన్న గ్రామంలోనే రెండెకరాల పొలం ఉంటే చాలు, కోటీశ్వరుడిని చేసే వ్యవసాయం ఇదే..

Published : Oct 30, 2022, 11:22 PM IST

పట్నం లో జాబ్స్ చేసి అలసిపోయారా చాలీచాలని జీతాలతో ఇరుకైన గదుల్లో జీవితం గడప లేక పోతున్నారా అయితే మీ సొంత గ్రామం లోనే ఉంటుంది నెలకు సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎక్కువ సంపాదించే అవకాశం వ్యవసాయ రంగంలో ఉంది.  అలాంటి చక్కటి వ్యవసాయం ఆలోచనలను ఈరోజు తెలుసుకుందాం.

PREV
16
Business Ideas: ఉన్న గ్రామంలోనే రెండెకరాల పొలం ఉంటే చాలు, కోటీశ్వరుడిని చేసే  వ్యవసాయం ఇదే..

ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది బ్లాక్ రైస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  ఈ నల్లబియ్యం ఎక్కువగా ఈశాన్య రాష్ట్రం లో పండుతుంది.  ఈ మధ్య కాలంలోనే రాష్ట్రంలో సైతం కొంతమంది రైతులు నల్ల బియ్యం పండించారు. మార్కెట్లో చక్కటి లాభాలను పొందారు.  మీరు కూడా నల్లబియ్యం పండించాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

26

మార్కెట్లో సాధారణంగా ఒక కేజీ నల్ల బియ్యం ధర సుమారు రెండు వందల రూపాయల వరకు ఉంది. అంటే మీరు పండించే సాధారణ బియ్యం కన్నా దాదాపు నాలుగు రెట్లు లాభం పొందవచ్చు. సాధారణ బియ్యం కన్నా కూడా నల్ల బియ్యం లో పోషక విలువలు ఎక్కువ. 

36

మహారాష్ట్రలోని రైతులు నల్ల బియ్యం పండించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.. అలాంటి ప్రయోగమే సాంగ్లీ జిల్లాలోని షిరాలా తాలూకాకు చెందిన కొందరు రైతులు చేశారు.  ఇక్కడి రైతులు తొలిసారిగా నల్ల వరి సాగుకు ప్రయత్నించి విజయం సాధించారు.. అస్సాం నుంచి విత్తనాలు తెచ్చుకుని నల్లవరి సాగు చేసేందుకు రైతులు ప్రయత్నించారు 
 

46

నల్ల వరి విత్తనాలు కిలో 200 నుంచి 250 రూపాయలకు వారికి లభించాయి. సాధారణ వరిసాగు తరహాలోనే ఈ పంట వేయగా రైతులకు మంచి దిగుబడులు వస్తున్నాయి.ఈ బియ్యం తినడానికి పోషకాలు, ఆరోగ్యకరం.ఈ బియ్యం వండడానికి కొంత సమయం పడుతుంది.కానీ ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.అందుకే గిరాకీ ఉంది.ఈ బియ్యం ధర కూడా ఎక్కువే.. రైతులకు కూడా మంచి లాభం వస్తుంది. 

56

రైతులు జూలై నెలలో వరిసాగు ప్రారంభించారు. వరి నారు పోసి పండించారు.  ఈ పంట నల్లరేగడి నేలలో బాగా పండుతోందని గమనించారు. ఈ బియ్యం పొడవు ఇతర బియ్యం కంటే ఎక్కువగా ఉంది. లోపలి బియ్యం రంగు నలుపు. రైతులు ఈ పంటకు సేంద్రియ ఎరువులు ఉపయోగించారు. తద్వారా రైతులు మంచి ఉత్పత్తిని పొందుతున్నారు.
 

66
Black rice 2

ఇదే సమయంలో మార్కెట్‌లో వీటికి అధిక డిమాండ్‌, అధిక ధర ఉండడంతో ఈ వరి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైతులు తెలిపారు. ఈ వరి హెక్టారుకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని, మార్కెట్‌లో కేజీ బియ్యం రూ.200 నుంచి రూ.300 ధర పలుకుతుందని, నల్ల బియ్యం సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని రైతులు తెలిపారు.

(నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏషియానెట్ తెలుగు ఎలాంటి వ్యాపార సలహాలు ఇవ్వడం లేదు. సంబంధిత రంగంలో నిపుణుల సలహా మేరకే నిర్ణయం తీసుకోండి.) 

click me!

Recommended Stories