ఫ్రాంచైజీ మోడల్ ద్వారా టీ షాపు పెట్టాలంటే, ముందుగా మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశంలో, ఒక షాపు అద్దెకి తీసుకోవాలి. అలాగే మీకు నచ్చిన బ్రాండ్ ఫ్రాంచైజీ వద్దకు పోయి, కొటేషన్ ఎంత ఉందో ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు ఆ ఫ్రాంచైజీ తీసుకుంటే, మీకు కలిగే లాభం ఏంటో, ముందుగా అంచనా వేసుకోవాలి. అప్పుడే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. ఇక టీ ఫ్రాంచైజీల విషయానికి వస్తే, మార్కెట్లో మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి, టీ షాప్స్ అనేకం ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ వ్యాల్యూ సుమారు రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. అగ్రిమెంట్ లో భాగంగా మీరు వారి ఉత్పత్తులను విక్రయించాల్సి ఉంటుంది.