Business Ideas: రాజస్థాన్, గుజరాతీ వ్యాపారుల కిరాణా వ్యాపారంలో స‌క్సెస్ సీక్రెట్ ఇదే, మీరు పాటించి చూడండి..

First Published Dec 26, 2022, 9:59 PM IST

నిరుద్యోగులకు ఉద్యోగం లేదని చింతిస్తున్నారా,  ప్రస్తుత కరోనా యుగంలో ఉద్యోగం ఒకటి అనే చెప్పాలి.  ఆర్థిక మాంద్యం ఫలితంగా అటు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో మీరు ఉద్యోగం కన్నా వ్యాపారం చేస్తే చక్కటి ఆదాయం సంపాదించుకునే వీలుండేది.  ఎందుకంటే వ్యాపారంలో  మీ పైన ఎవరూ  బాస్ ఉండరు.  అంతే కాదు ఉన్న ఊరిలోనే  మీరు చక్కగా, సంపాదించుకునే వీలుంది. 

కిరాణా వ్యాపారం కొత్తేమి కాదు.  కానీ కిరాణా వ్యాపారాన్ని క్రమశిక్షణతో,  ఓ పద్ధతిగా చేస్తే చక్కటి లాభాలను పొందే వీలుంది.  ఈ మధ్యకాలంలో  రాజస్థాన్, గుజరాత్ నుంచి వస్తున్నటువంటి వ్యాపారులు,  కిరాణా వ్యాపారంలో చక్కగా రాణిస్తున్నారు.  అంతేకాదు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.  లోకల్ గా ఉన్నటువంటి వ్యాపారులకు సాధ్యం కానిది.  రాజస్థాన్ గుజరాత్ కు చెందిన వ్యాపారులు ఎలా సాధ్యమవుతుందని  చాలామంది ఆరా తీస్తున్నారు. 
 

మీరు కూడా రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల తరహాలోనే రాణించాలి అనుకుంటున్నారా,  అయితే కొన్ని వ్యాపార పద్ధతులను అమలు చేసి కిరాణా వ్యాపారం లో ఎలా లాభాలు గడించాలో తెలుసుకుందాం. నిజానికి రాజస్థాన్ గుజరాత్ వ్యాపారులు భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ చొరవతో చొచ్చుకు పోతుంటారు. 

రాజస్థాన్ గుజరాత్ వ్యాపారుల సక్సెస్ సీక్రెట్ విషయానికి వస్తే,  ఆర్థిక  క్రమశిక్షణ వీళ్ళను ముందుండి నడిపిస్తుంది.  అనవసరంగా డబ్బులు వృధా చేయరు.  మద్యం,  మాంసం,  ఇతర దురలవాట్లకు దూరంగా ఉంటారు.  తద్వారా వీళ్లకు డబ్బు ఎక్కువగా వృధా అవ్వదు.  అలాగే కుటుంబాన్ని వ్యాపారంలో ఇన్వాల్వ్ చేస్తారు.  వాళ్లు కిరాణా షాపు ఓపెన్ చేయాలనుకుంటే,  ముందుగా ఆ ప్రాంతానికి వెళ్లి స్టడీ చేస్తారు. ఒకవేళ అక్కడ సక్సెస్ అవుతుందంటే.  పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి,  కిరాణా షాప్ తెరుస్తారు.

ఇక పెట్టుబడి విషయానికి వస్తే కో-ఆపరేటివ్ పద్ధతిలో ఈ వ్యాపారులంతా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని,   క్రెడిట్ ఇచ్చుకుంటారు.  ఇదంతా అన్ ఆర్గనైజ్డ్ గా సాగిపోతూ ఉంటుంది.  బ్యాంకు రుణాల పై ఎక్కువగా ఆధారపడ్డారు. గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు పెద్దగా చదువుకోకపోయిన అప్పటికీ,  కేవలం వ్యాపార విలువలు పాటించడం వల్లనే  సక్సెస్ అవుతుంటారు.

కిరాణా షాపును అందంగా,  అలంకరిస్తారు.  సరకులను ఓ పద్ధతి ప్రకారం,  చిందరవందరగా కాకుండా సర్దుబాటు చేస్తారు. షాపులో పూర్తిగా లైటింగ్ వాడుతారు. అప్పుడే కస్టమర్లను ఎక్కువగా ఎట్రాక్ట్  అవుతారు. హోల్సేల్ ధరలకు సరుకులను విక్రయించేందుకు,  ఈ వ్యాపారులు సిద్ధపడుతుంటారు. ఎమ్మార్పీ కన్నా కూడా కొద్దిగా తక్కువ ఇచ్చేందుకే ఈ వ్యాపారులు మొగ్గు చూపుతుంటారు. 
 

కస్టమర్లకు కు ధర తగ్గిస్తారు. కానీ అరువు ఇచ్చేందుకు అంతగా ఇష్టపడరు.  ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా,  వీరు జాగ్రత్త పడతారు. సరుకు ధర కన్నా కూడా,  నాణ్యత ఎక్కువ ఉన్న వస్తువు పైనే వీరు మొగ్గుచూపుతారు. తద్వారా కస్టమర్లు ఎక్కువగా వీరి షాపునకు వెళ్లేందుకు ఆకర్షితులవుతుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆడిటింగ్,  మీరు ఎప్పటికప్పుడు పెట్టుబడికి,  ఆదాయానికి ఎంత గిట్టుబాటు అవుతోందో తరచూ చెక్ చేసుకుంటూ ఉంటారు.  తద్వారా వీళ్లకు వ్యాపారంలో జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు నిత్యం కృషి చేస్తుంటారు. 

click me!