అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే అందరికీ పెద్దపెద్ద ఇన్స్టిట్యూట్ లు గుర్తొస్తాయి. లక్షలాది ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని భయపడుతుంటారు. కానీ అతి తక్కువ ధరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సెట్విన్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో అందిస్తోంది. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికెట్ కోర్సులను నేర్చుకొని. మీరు సొంతంగా బొటిక్ తెరుచుకోవచ్చు. తద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. FASHION DESIGNING, ADVANCED FASHION DESIGNING కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఫీజు కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే. కోర్సు వ్యవధి మూడు నెలలు, ssc ఫెయిల్ అయినా పర్లేదు. చదువుతో సంబంధం లేకుండా ఈ వృత్తి విద్యా కోర్సులు అందిస్తున్నారు.