ప్రస్తుతం బిజీ కాలంలో ఇంటి వద్ద వయసు మళ్ళిన పెద్దవాళ్లను చూసుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే పెద్దవాళ్లు మంచానికి పరిమితమై ఉండటం వలన వాళ్ళు వాళ్ళ పనులను చేసుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది. అలాంటి వారికి ఆపన్న హస్తం అందించి మీరు ప్రతి నెల ఆదాయం కూడా పొందే వీలుంది. ప్రస్తుతం పట్టణాల్లో వృద్ధాశ్రమాలు వృద్ధులను ఇంటివద్దె చూసుకునేందుకు కేర్ టేకర్లను పంపుతున్నాయి. ఈ కేర్ టేకింగ్ పనినే మీరు ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చు. తద్వారా సమాజ సేవతో పాటు మీకు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే ఈ కేర్ టేకింగ్ పని ఎలా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా, అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.