కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 పెట్టుబడి సాయం అందుతుంది. ఒక్కొక్కటి రూ.2,000 చొప్పున మూడు విడతలుగా రూ.6,000 వార్షిక డిపాజిట్ చేస్తుంది. ఇప్పటివరకు 11 విడతలుగా డబ్బులు పడ్డాయి. 12 విడత ఆగస్ట్, నవంబర్ మధ్య విడుదల అవుతుంది. రైతులు KYC ప్రక్రియను పూర్తి చేస్తే 12వ వాయిదాను పొందవచ్చు.