Business Ideas: 6 నెలలు ఓపిక పడితే చాలు ఈ బిజినెస్ ద్వారా ఈజీగా 10 లక్షల వెనకేసుకోవచ్చు, వెంటనే తెలుసుకోండి

First Published Dec 25, 2022, 7:35 PM IST

మీ గ్రామం లోనే ఉంటూ లక్షల్లో ఆదాయం సంపాదించాలని ఉందా అయితే మనసుంటే మార్గం ఉంటుంది అన్న టు,  తెలివితేటలు ఉంటే చాలు మీరు ఉన్నచోటే లక్షల్లో ఆదాయం సంపాదించే వీలుంది.  అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.  సాధారణంగా సాంప్రదాయ వ్యవసాయంలో పెద్దగా లాభం ఉండదు.  మీ పెట్టుబడులకు రాబడికి  సరిపోతుంది.  కానీ వాణిజ్య పంటలను వేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది. 

వాణిజ్య పంటల కన్నా కూడా ఔషధ మొక్కలను సాగు చేయడం ద్వారా,  మరింత ఎక్కువ లాభం పొందే వీలుంది.  ప్రస్తుతం అశ్వగంధ సాగు ద్వారా, ఎలా సంపాదించవచ్చు తెలుసుకుందాం.  అశ్వగంధ అనేది,  ఆయుర్వేదంలో విరివిగా వాడే ఔషధమూలిక.  దీన్ని తెలుగులో  పెన్నేరుగడ్డ అంటారు. దీని వేరు నుంచి పండు వరకు అన్నీ ఔషధాలే.  ముఖ్యంగా అశ్వగంధ  వేర్లను ఎండబెట్టి పొడి చేసి అశ్వగంధ పొడి ని ఎలా తయారు చేస్తారు.  దీన్ని అనేక  ఔషధాల లో వాడుతారు. 
 

అశ్వగంధను అన్ని రకాల నేలల్లోనూ పండించవచ్చు. అశ్వగంధ పంట ఆరు నెలల్లోనే సిద్ధమైపోతుంది.  కేవలం ఆరు నెలల వ్యవధి కాలంలోనే దీని వేర్లను వేరు చేసి,  పొడి చేసి అమ్మడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  లేదా నేరుగా వేళ్లను విక్రయించడం ద్వారా కూడా,  చక్కటి ఆదాయం సంపాదించవచ్చు.  మార్కెట్లో అశ్వగంధ వేర్ల  ధర ఒక కేజీ సుమారుగా 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది.  అదే దీన్ని పొడిచేసి అమ్మితే.  600 నుంచి 800 రూపాయల వరకు సంపాదించవచ్చు. 

అనేక ఔషధ సంస్థలు సైతం అశ్వగంధ వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తుంటాయి.  అయితే అశ్వగంధ ను ఎలా సాగు చేయాలో  తెలుసుకుందాం.  ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సరిగ్గా సరిపోతాయి.  ఒక ఎకరానికి సుమారు ఏడు నుంచి ఎనిమిది కేజీల విత్తనాలు అయితే సరిపోతాయి. దీనికి సహజ ఎరువులు వాడితే మంచిది.  తెగులు రాకుండా అవసరమైన మందులను  సస్య సంరక్షణ వ్యవసాయ అధికారుల వద్ద  నుంచి  తెలుసుకుంటే మంచిది. 
 

నల్లరేగడి,ఇసుక లోమి నేలల్లో కూడా ఇది పండుతుంది. ఆరు నెలల్లో, మూడు ఎకరాల్లో పంట వేసుకుంటే చాలు, ఖచ్చితంగా 6,7 లక్షలు ఈజీగా సంపాదించే వీలుంది. ఎన్ని ఎకరాలు వేసుకుంటే మీరు అంత సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎవరు కొంటారు మార్కెట్ ఎలా అనే సందేహం మీకు రావచ్చు.
 

మధ్యప్రదేశ్ లోని నీమచ్ మార్కెట్ లో దీనికి మంచి డిమాండ్ ఉంది. అక్కడ మార్కెట్ వాళ్ళను మీరు సంప్రదించాలి. మంచి క్వాలిటీ ఉన్న సరుకును వారు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. మంచి రేటు వచ్చే దాకా దీన్ని మీరు నీడలో ఆరబెట్టి దాచుకోవచ్చు. ఎప్పుడైతే మంచి మార్కెట్ ధర ఉంటుందో ఆ టైంలో మీరు ఈ పంటను విక్రయించవచ్చు. 

click me!