సాధారణంగా పరాటా మధ్యలో ఆలుగడ్డ, ముల్లంగి, పనీర్, చికెన్, మటన్ కర్రీలను వాడుతూ ఉంటారు. తద్వారా వెజ్ నాన్ వెజ్ పరాటాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే ఎక్కువగా ఆలుగడ్డ పరాటాలు తినేందుకే జనం ఆసక్తి చూపుతూ ఉంటారు. మీరు కూడా పరాటా సెంటర్ ప్రారంభించాలనుకుంటే. ఒక మంచి సెంటర్లో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఒక షాపును రెంటుకు తీసుకొని కూడా పరాటా సెంటర్ ప్రారంభించవచ్చు.