Business Ideas: ప్రధాని మోదీ అందించే లోన్ తో ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష ఈజీగా సంపాదించే చాన్స్ ఉంది..

First Published Jan 23, 2023, 2:57 PM IST

నిరుద్యోగులారా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే ఇకపై ఏమాత్రం ఎదురుచూడదు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను అందిపుచ్చుకొని వ్యాపారం చేయడం ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది తద్వారా మీరు సొంత కాళ్లపై నిలబడి మరో నలుగురికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

ముద్రా రుణాలను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల ద్వారా యువతకు అందిస్తోంది.  ప్రతి బ్యాంకు ముద్రా రుణాలను నిరుద్యోగ యువత అలాగే వ్యాపారులకు అందించాల్సి ఉంటుంది.  ఈ రుణాలకు ఎటువంటి హామీ ఇవ్వకుండానే అందజేస్తున్నారు అయితే మీరు చేయబోయే వ్యాపారం యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ ను బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది.  బయట ప్రైవేటు వడ్డీల కన్నా కూడా చాలా తక్కువ వడ్డీ రేటుకే ఈ రుణాలను అందజేస్తున్నారు. ముద్రా రుణాలను 50 వేల నుంచి పది లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. 
 

మీరు పొందిన రుణాలతో ఏ వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుందో ముందే తెలుసుకుంటే చాలా మంచిది. తద్వారా మీరు ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అటువంటి వ్యాపారం గురించి ఒక తెలుసుకుందాం.  స్టేషనరీ జిరాక్స్ సెంటర్ ప్రారంభించి ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. 
 

నేటి కాలంలో కాలేజీలు స్కూల్స్ ఆఫీసుల సంఖ్య భారీగా పెరుగుతుంది చిన్న పట్టణాల్లో సైతం ఇంజనీరింగ్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలో స్కూళ్లు ఆఫీసుల సంఖ్య పెరిగింది కావున వీరికి స్టేషనరీ అవసరాలు పెరుగుతాయి.  ముఖ్యంగా జిరాక్స్ కాపీలు పెన్నులు పుస్తకాలు కాగితాలు రికార్డు బుక్కులు నోటు పుస్తకాలు బిల్లు పుస్తకాలు ఇలా ప్రతి ఒక్కటి అవసరం పడుతుంటాయి.

కావున మీరు స్టేషనరీ జిరాక్స్ సెంటర్ ప్రారంభించి చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ముందుగా జన సమర్థత ఎక్కువ ఉండి విద్యాసంస్థలు సమీపంలో ఉన్న ప్రదేశంలో ఒక షాపును రెంటుకు తీసుకోవాలి. ఒక కంప్యూటర్ జిరాక్స్ మిషన్  ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.  అలాగే మీరు జిరాక్స్ సెంటర్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి జిరాక్స్ మిషన్ ను కొనుగోలు చేసుకోవాలి.  అలాగే స్టేషనరీ సామాన్లను సైతం హోల్సేల్ ధరలకే కొనుగోలు చేసుకుని అందుబాటులో ఉంచుకోవాలి. లామినేషన్, బుక్ బైండింగ్  వంటి సదుపాయాలను కూడా మీ వద్ద ఉంచుకోవాలి.

విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుకోవాలి ముఖ్యంగా పోటీ పరీక్షలకు విరివిగా చదివే పుస్తకాలను మీ వద్ద అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే కంపాస్ బాక్సులు, ఇతర స్టేషనరీ సామాగ్రిని కూడా మీరు అందుబాటులో ఉంచుకోవాలి. సరుకులు హోల్సేల్ మార్కెట్లోనే కొనుగోలు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా కూడా హోల్సేల్ మార్కెట్ వస్తువులు లభిస్తున్నాయి. అందులో కూడా కొనుగోలు చేస్తే మీకు లాభం దక్కే అవకాశం ఉంది. జిరాక్స్ మిషన్ ను ఆపరేషన్ మీరు పూర్తిగా తెలుసుకోవాలి. లేకపోతే వర్కర్ పై ఆధారపడితే  భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది.

click me!