Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండానే కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించే బిజినెస్ ఇదే

First Published Jan 23, 2023, 11:49 AM IST

మహిళలు ఇంటి వద్ద ఉండి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే ప్రతి నెల ఒక లక్షకు తగ్గకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అలాంటి బిజినెస్ ఐడియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Meesho app

మహిళలు తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని ప్రతి నెల డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.  కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే కొద్ది సమయం కేటాయించడం ద్వారా ప్రతినెలా ఒక లక్ష వరకు సంపాదించే అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఆన్లైన్ ద్వారా చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  ప్రస్తుతం మీ షో యాప్ ద్వారా మహిళలు ఇంట్లో ఉండే డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం. 

 మీ షో యాప్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ ఫారం ఇందులో మీ వస్తువులను అమ్ముకునే వీలుంది.  మీ షో యాప్ లో మీరు అమ్మకంధారుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ప్రోడక్ట్ ను షోకేస్ చేసే అవకాశం ఉంది అలాగే  మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా యాప్ లోనే ఉంటాయి తద్వారా మీకు ఆర్డర్లు పొందే అవకాశం ఉంటుంది. మీ షో యాప్ ద్వారా దుస్తులు ఆర్టిఫిషియల్ జువెలరీ ముఖ్యంగా అమ్ముడుపోతున్నాయి. 
 

 ఉదాహరణకు మీరు హోల్సేల్ ధరలకే  మంచి నాణ్యమైన చీరలను కొనుగోలు చేసి మీ లాభం మార్జిన్ ను అందులో కలుపుకొని మీ షో యాప్ లో విక్రయించుకునే అవకాశం ఉంది.  అలాగే ఆర్టిఫిషియల్ జువెలరీని సైతం మీరు ఈ యాప్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. అలాగే మీ షో యాప్ ద్వారా గృహప్రకారణాలను సైతం విగ్రహించే అవకాశం ఉంది.  మీరు కళాకారులైనట్లయితే పెయింటింగ్స్,  బొమ్మలు,  హ్యాండ్ మేడ్ అలంకరణ వస్తువులను మీ షో యాప్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. 
 

meesho

కస్టమర్లను మీరు పెద్ద ఎత్తున ఈ యాప్ ద్వారా నేరుగా పొందే అవకాశం ఉంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మీ షో యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలను నమోదు చేసి బ్యాంకింగ్ డీటెయిల్స్ కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తద్వారా మీరు  విక్రేతగా ఇందులో నమోదు అవుతారు. ఆ తర్వాత మీరు విక్రయించదలచుకున్న వస్తువులను షోకేసింగ్ చేసి ఇందులో విక్రయించుకునే అవకాశం ఉంది. 

మీ షో తరహాలోనే మరికొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి అందులో కూడా మీరు వస్తువులు దుస్తులు ఆర్టిఫిషియల్ జువెలరీ విక్రయించే అవకాశం ఉంది.  ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మీరు ఒక షాపు కూడా లేకుండానే ప్రతి నెల ఈ యాప్స్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  అయితే పూర్తి వివరాలను తెలుసుకొని ఈ వ్యాపారం లోకి దిగడం మంచిది. . అలాగే పన్ను సంబంధిత వివరాలను సైతం మీరు తెలుసుకొని దిగితే ఎటువంటి సమస్యలు ఉండవు.   
 

click me!