బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే చాలు చదువుతో సంబంధం లేదు. ఒక మంచి ఐడియాతో మీరు ప్రతి నెల 5 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి మనం తెలుసుకుందాం.
బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే ఇక ఏమాత్రం సమయం వృధా చేయకుండా కార్యాచరణలోకి దిగిపోండి. వ్యాపారం చేయాలనుకుంటే ముందుగా కావాల్సిందే పెట్టుబడి ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అలాగే చిరు వ్యాపారాలు చేసే వారికి ముద్రా రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. అన్ని ప్రభుత్వ బ్యాంకులో ముద్రా రుణాలను అందిస్తున్నాయి.
26
ముద్రా రుణాల కింద 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ముద్రా రుణాల్లో వడ్డీ రేటు బయట వడ్డీరేట్ల తో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంటుంది మీరు కట్టే ఈఎంఐ లో కూడా వడ్డీ అలాగే అసలు రెండు కలిపి వసూలు చేస్తారు దీని వల్ల మీరు తీసుకున్న రుణం నిర్ణీత కాల వ్యవధిలో తీరిపోతుంది ఇది ఒక రకంగా వ్యాపారికి భారం తీర్చుతుంది.
36
Image: Getty Images
ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ చాలా పాపులర్ అవుతోంది. ముఖ్యంగా బిర్యానీ తినేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బిర్యాని రుచి అటు పిల్లలనుంచి పెద్దల వరకు అందరికీ నోరూరిస్తుంది. బిర్యానిని ఎన్ని రకాలుగా చేసినప్పటికీ జనం తినేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఎన్ని బిర్యాని పాయింట్లు ఉన్నప్పటికీ కొంచెం వెరైటీగా ట్రై చేస్తే మాత్రం మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. అలాంటి ఓ వెరైటీ బిర్యానీ బిజినెస్ ను మనం తెలుసుకుందాం.
46
సాంప్రదాయ రుచులను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే మీరు సాంప్రదాయ రుచులను పరిచయం చేసేలా బిరియాని తయారు చేస్తే కస్టమర్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు కుండలో బిరియానీ సర్వ్ చేయడం ద్వారా మంచి అట్రాక్షన్ పొందవచ్చు. ఇందు కోసం మీరు కుండలను తయారు చేసే కళాకారులతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది. అంతేకాదు ప్రస్తుతం ప్లాస్టిక్ ప్యాకెట్లలో బిర్యానీ సర్వ్ చేయడం ఆరోగ్యానికి హాని కరం. కుండలో అయితే ఆ సమస్య ఉండదు.
56
Image Credit: Getty Images
కుండలో బిర్యానీ వేడి కూడా చాలా సేపు ఉంటుంది. అందుకే కుండ బిర్యానీ సెంటర్ ఓపెన్ చేయడం ద్వారా మంచి ఆదరణ పొందే వీలుంది. ఈ తరహా బిర్యానీ సెంటర్ కోసం క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలి. దీని కోసం రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత బిర్యానీ డోర్ డెలివరీ చేసేందుకు ఫుడ్ డెలివరీ యాప్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది. అలాగే మీరే స్వయంగా డెలివరీ బాయ్స్ ను పెట్టుకొని మీ క్లౌడ్ కిచెన్ కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచిత డోర్ డెలివరీ పెడితే మరింత ఆర్డర్లు పొందే వీలుంది.
66
Jackfruit Biryani Recipe
ఇక మీ వ్యాపార ప్రచారం కోసం, డిజిటల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా చక్కటి పబ్లిసిటీ లభిస్తుంది. అలాగే డిస్కౌంట్స్, ఇవ్వడం ద్వారా కూడా మంచి ప్రచారం దక్కుతుంది. ఇక మీ వ్యాపారం లాంగ్ రన్ లో సక్సెస్ కావాలంటే మాత్రం రుచి నాణ్యతపై దృష్టిపెట్టాలి. అప్పుడే సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఈ బిజినెస్ మంచి సక్సెస్ అందుకుంటే మరిన్ని క్లౌడ్ కిచెన్ లను ఓపెన్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు.