మీ ప్రియురాలి పేరిట ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయండి
మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే మీ ప్రియురాలు లేదా సతీమణి పేరిట ఒక ప్లాటును కొనుగోలు చేయడం ద్వారా, చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్న ఈ తరుణంలో పలు సంస్థలు అందిస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్కటి లాభం అందుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు ఆ ఓపెన్ ప్లాటులో ఇల్లు కట్టుకోవచ్చు. లేదా మంచి రేటు లభిస్తే విక్రయించి లాభం పొందే వీలుంది.