మీకు రెస్టారెంట్ స్టైల్ లో వంటలు చేయడం వచ్చినట్లయితే క్లౌడ్ కిచెన్ ద్వారా మీ కస్టమర్లకు రుచులను అందించవచ్చు. Zomato, swiggy ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మీ కస్టమర్లను చేరుకోవచ్చు. మీరు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేయాలి అనుకున్నట్లయితే, మీరు ఏమేం వంటలు చేయాలనుకుంటున్నారో అందుకు తగ్గట్టుగా కిచెన్ డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు బిర్యాని సెంటర్ తెరవాలి అనుకున్నట్లయితే అందుకు తగ్గట్టుగా కిచెన్ డిజైన్ చేసుకోవాలి. . బిర్యానీ సెంటర్ కిచెన్ కోసం మీరు కనీసం 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.