Business Ideas: మహిళలు ఇంట్లో ఓ రెండు, మూడు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..

Published : Dec 13, 2022, 11:38 PM IST

మహిళలు ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకుంటున్నారా. అయితే మీ ఖాళీ సమయంలో రోజుకు కేవలం రెండు మూడు గంటలు కేటాయిస్తే చాలు.  ప్రతి నెల 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.  మరి అది ఏం బిజినెస్ అని ఆలోచిస్తున్నారా. అయితే వెంటనే తెలుసుకుందాం. 

PREV
16
Business Ideas: మహిళలు ఇంట్లో ఓ రెండు, మూడు గంటలు కష్టపడితే చాలు నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..

ప్రస్తుత డిజిటల్ యుగంలో,  ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, మీ ఇల్లే ఆఫీసు గా మారిపోతుంది.  కంప్యూటర్ టేబుల్ వద్ద కూర్చొని  పని చేస్తే చాలు ప్రతి నెల లక్షల్లో జీతం పొందే వీలుంది.  మీరు గతంలో బీటెక్,  లేదా కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు,  ఒక వేళ మీరు కంప్యూటర్ కోర్సులు చేసి ఉన్నా చాలు.  మీరు ఇంట్లో కూర్చుని సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్రతినెల లక్షల్లో జీతం పొందే అవకాశం ఉంది.  ఇందుకు సంబంధించి ఏం చేయాలో తెలుసుకుందాం.

26

 సాఫ్ట్ వేర్ కంపెనీలు ఫ్రీ లాన్సర్ల ద్వారా తమ పనులు కానిస్తున్నాయి. ఇందు కోసం పలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను వాడుకొని ఫ్రీ లాన్సర్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ తరహా ఉద్యోగాలు చేసేందుకు గృహిణులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.  పలు సాఫ్ట్వేర్ కంపెనీలు కోడింగ్,  డేటా ఎంట్రీ, టెస్టింగ్ టూల్స్ వంటి పనులకు ఈ ఫ్రీలాన్సర్లను వాడుకుంటున్నారు. అలాగే పలు సాఫ్ట్ వేర్ ప్రాజెక్టులకు ప్రోగ్రామర్లుగా కూడా ఈ ఫ్రీలాన్సర్లనే వాడుకుంటున్నారు. 
 

36

మహిళలు మీకు కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం తో అనుబంధం కలిగి ఉండి,  వివాహం తర్వాత కుటుంబ బాధ్యతల్లో పడి, ఉద్యోగానికి దూరమయ్యామని భావిస్తున్నారా. అయితే బాధపడకండి ఫ్రీలాన్సర్ లుగా మారి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తరహాలోనే మంచి వేతనాలు పొందే అవకాశం ఉంది. 

46

ప్రస్తుతం మార్కెట్లో Fiverr, Upwork, PeoplePerHour, Freelancer.com, Toptal వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా  మీరు ఫ్రీలాన్స్ ఉద్యోగాలు పొందవచ్చు.  ఫ్రీలాన్స్ ఉద్యోగాలలో  రోజుకు 3 నుంచి 4 గంటల వరకు పని చేస్తే సరిపోతుంది.  మిగతా సమయాల్లో మీ ఇంటి పనులు చూసుకోవచ్చు. ఇక ఫ్రీ లాన్సర్లకు  ఉద్యోగుల తరహాలో కాకుండా గంటల చొప్పున  చెల్లిస్తుంటారు.  తద్వారా ఏరోజుకా రోజు డబ్బు సంపాదించుకోవచ్చు. 

56

ఒకవేళ మీరు టీచింగ్ ప్రొఫెషన్ లో నైపుణ్యం గల వారు అయినట్లయితే, యూట్యూబ్ ద్వారా సైతం చక్కటి ఆదాయం పొందే వీలుంది. మీకు నచ్చిన  సబ్జెక్టుల్లో పాఠాలను చెప్పి,  వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా,  మానిటైజేషన్ అనంతరం డబ్బు సంపాదించే వీలుంది.  అలాగే కుకింగ్ వీడియోస్ కు సైతం,  ఆన్లైన్లో లో మంచి డిమాండ్ ఉంది. 

66

అలాగే మహిళలు, సంగీతం, నృత్యం, పెయింటింగ్ వంటి కళల్లో రాణిస్తున్నట్లయితే, ఆన్లైన్ క్లాసులు చెప్పడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. ఆన్ లైన్ ద్వారా పెయింటింగ్స్ కూడా విక్రయించవచ్చు.  తద్వారా కూడా మంచి ఆదాయం పొందే వీలుంది.

Read more Photos on
click me!

Recommended Stories