Business Ideas: ఒకటో తారీఖు జీతం చూసి ఇదేం జీవితం అని బాధపడుతున్నారా, అయితే నెలకు లక్ష సంపాదించే ఈజీ బిజినెస్

First Published Dec 13, 2022, 4:21 PM IST

ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి అలసి పోయారా. మీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదా.  వచ్చిన జీతం సరిపోవటం లేదా,  పెరుగుతున్న ఖర్చులను చూసి భయపడకండి.  ధైర్యంగా వ్యాపారంలో ముందడుగు వేస్తే  చక్కటి లాభాలను పొందవచ్చు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ముద్ర యోజన పథకం కొత్త వ్యాపారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది.  మీ వ్యాపారానికి పెట్టుబడి గా మారుతుంది.  ముద్ర యోజన పథకం కింద నేరుగా బ్యాంకులో నుంచి. రుణం పొందే వీలుంది తద్వారా మీరు పది వేల నుంచి పది లక్షల రూపాయల వరకూ ముద్ర రుణం ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు. 
 

ఇప్పుడు ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇప్పుడు వివరించబోయే ప్లాన్ మీకు చాలా  కొత్తగా అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చూస్తే మంచి లాభసాటి  వ్యాపారం గా మారే అవకాశం ఉంది.  మార్కెట్లో ఫుడ్ బిజినెస్ కు తిరుగు లేదనే చెప్పాలి.  ఎందుకంటే జనాభా పెరిగేకొద్దీ  ఆహార అవసరాలు కూడా పెరుగుతూనే ఉంటాయి.  దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మనం సాండ్ విచ్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. 
 

ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా సాండ్ విచ్  తినేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.  దీన్నే మీరు ఒక సాండ్ విచ్  బిజినెస్ గా మార్చుకొని  ఆదాయం పొందే వీలుంది. సాండ్ విచ్  మేకింగ్ బిజినెస్ కోసం,  మీరు ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి.  స్ట్రీట్ ఫుడ్ తరహాలో స్టాల్ ఏర్పాటు చేసుకుంటే, మీకు పెట్టుబడి తక్కువ అవుతుంది.  లేదా ఒక షాపు రెంటుకు తీసుకొని  బేకరీ తరహాలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 
 

సాండ్ విచ్  తయారీ కోసం ముఖ్యంగా కావలసింది గ్రిల్డ్ సాండ్ విచ్  మిషిన్,  ఇది మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తోంది. కమర్షియల్ పద్ధతిలో సాండ్ విచ్  మేకింగ్ మెషీన్లను ఇండియా మార్ట్ ఇలాంటి వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.  వీటి ధరలు 10 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి.  అలాగే సాండ్ విచ్  తయారీ కోసం అవసరం అయింది, బ్రెడ్, దీన్నీ మీరు హోల్ సేల్ బేకరీల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. 
 

సాండ్ విచ్  తయారీ కోసం,  మీరు ఒక వంట మనిషిని పెట్టుకునే బదులు,  మీరే హోటల్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి శిక్షణ పొందితే సరిపోతుంది.  ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధి శిక్షణ కేంద్రాల్లో సైతం బేకరీ ఉత్పత్తుల తయారీ విధానాలను నేర్పిస్తున్నారు. తద్వారా మీరు సాండ్ విచ్  తయారీ లో   మెలకువలను నేర్చుకోవచ్చు. 
 

ఇక శాండ్విచ్ బిజినెస్ సక్సెస్ కావాలంటే,  ముందుగా మీరు కొత్త రుచులను ప్రయత్నించాల్సి ఉంటుంది.  వెజ్ నాన్ వెజ్ శాండ్ విచ్ లతో పాటు, చైనీస్, కాంటినెంటల్, మొఘలాయీ లాంటి కొత్త రుచులతో కూడిన శాండ్ విచ్ లను ప్రవేశపెడితే కస్టమర్లు ఆకర్షితులు అవుతారు.  తే ఇక ఈ బిజినెస్ పెట్టుబడి విషయానికి వస్తే సుమారు 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.  ఆదాయం విషయానికి వస్తే కనీసం నెలకు 50000 వరకు సంపాదించే వీలుంది. కాలేజీలు,  షాపింగ్ మాల్స్,  పార్కులు,  ఇతర కమర్షియల్ ఏరియాల్లో శాండ్విచ్ తయారీ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ ఫుల్ బిజినెస్ అవుతుంది. 

(నోట్: పైన తెలిపిన సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసమే, మీ పెట్టుబడులకు ఏషియానెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. వ్యాపారం ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోండి )

click me!