Business Ideas: ఎవరికీ తెలియని, ఈ తరహా ఫుడ్ బిజినెస్ చేస్తే, చాలా ఈజీగా కోటీశ్వరులు అయ్యే అవకాశం..

First Published Dec 13, 2022, 10:52 PM IST

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా, అయితే వినూత్నంగా ఆలోచించి రంగంలోకి దిగితే చక్కటి విజయం పొందే అవకాశం ఉంది. మీరు కూడా బిజినెస్ రంగంలో రాణించాలంటే ఈ వినూత్నమైన ఐడియాతో వ్యాపారం కొనసాగిస్తే మేలు. 

ఉద్యోగం చేస్తూ దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు అన్నట్లు, జీవితం గడిచిపోతోందా, నెలనెలా వచ్చే జీతం ఏ మాత్రం సరిపోవడం లేదా,  ఇంటి అద్దె,  ఖర్చులు,  పిల్లల ఫీజులు,  అవసరాలు వీటన్నింటికీ  మీకు వచ్చే ఆదాయం మాత్రం ఏ మాత్రం సరిపోవడం లేదని భావిస్తున్నారా, అయితే  వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి కష్టపడితే చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు.  దాంతోపాటు మీ సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంది.ఇందులో భాగంగా కొత్త తరహా వ్యాపారాల కోసం అన్వేషించే వారికి  ప్రస్తుతం డిస్కస్ చేస్తున్న ఈ వ్యాపారం ఉపయోగపడే అవకాశం ఉంది. 
 

ఫుడ్ బిజినెస్ లో ఎన్ని రకాలు ఉన్నప్పటికీ,  డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఎంతమంది అడుగుపెట్టినా, ఈ బిజినెస్ లో మరికొంత మందికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ బిజినెస్ ఏ ప్రాంతంలో అయినా సరే సక్సెస్ అవుతుంది. అయితే నాణ్యత, రుచి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.  ప్రస్తుతం కుండ బిర్యాని బిజినెస్ గురించి తెలుసుకుందాం. 
 

బిర్యానీ బిజినెస్ ఎన్ని రకాలుగా చేసిన జనం ఇష్టపడుతూ ఉంటారు. కాస్త వినూత్నంగా బిర్యానీ చేస్తే చాలు. రుచి చూసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ కుండ బిర్యాని.  కుండ బిర్యాని అనగానే మీకు సందేహం కలగవచ్చు. ఇది చాలా ప్రయాసతో కూడింది అనిపించవచ్చు. కానీ జనం వెరైటీ రుచులకు కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు.  అలాంటివారికి కుండ బిర్యానీ ఆకట్టుకునే అవకాశం ఉంది. 

సాధారణ బిర్యాని సెంటర్ తరహాలోనే ఈ కుండ బిర్యాని సెంటర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బిర్యానీ వండటం తెలిసిన మంచి కుకింగ్ మాస్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం బిర్యానీని గుండెల్లో దమ్ పెట్టుకునేలా ఏర్పాటు చేసుకోవాలి.  ఇందుకోసం స్థానిక ఉత్పత్తి దారులతో  చిన్న మట్టి కుండలను తయారు చేయించుకోవచ్చు.  కుండ బిర్యానిలో  ఉడికిన బిర్యానీకి రుచి  చాలా బాగుంటుందని,  చాలామంది చెబుతుంటారు.  అందుకే ప్రస్తుతం హైదరాబాదు లాంటి నగరాల్లో సైతం కేవలం కుండ బిర్యానీ తయారు చేసే హోటల్ ల సంఖ్య పెరిగింది. 
 

ఇక ఈ తరహా బిర్యాని సెంటర్లలో సేల్స్ బాగుండాలంటే,  మీరు నాణ్యత పైన ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే రుచి పైన కూడా దృష్టి పెట్టాలి.  అప్పుడే మీకు  సేల్స్ బాగుంటాయి. అంతేకాదు పబ్లిసిటీ విషయంలో కూడా వినూత్నంగా వ్యవహరిస్తే,  మీ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.  పబ్లిసిటీ కోసం మీరు సోషల్ మీడియాలోని  ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం చేయిస్తే మరింత లాభం కలిగే అవకాశం ఉంది.  అలాగే బిర్యానీ ఆర్డర్లను పొందేందుకు పెద్ద స్విగ్గీ, జొమాటోతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంటే మరింత ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంది. 

click me!