జాగిరి పౌడర్ ను రైతులే తయారుచేస్తారు. వారి వద్ద హోల్ సేల్ గా కొన్నట్లయితే, మీకు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఒక కేజీ బెల్లం పొడి మీకు కేవలం యాభై రూపాయల నుంచి 60 రూపాయలు మాత్రమే లభిస్తుంది. అయితే వీరి వద్ద నుంచి క్వింటా లెక్కన కొనాల్సి ఉంటుంది. ఒక క్వింటా బెల్లం పొడి సుమారుగా, 5000 వరకు ఉంటుంది. ఇక మీరు చేయవలసిన బెల్లం పొడిని టోకుగా కొనుగోలు చేసి, దాన్ని 200 గ్రాములు, 300 గ్రాములు, 500 గ్రాములు, 750 గ్రాములు, ఒక కేజీ ప్యాకెట్లుగా చేసి విక్రయించడం ద్వారా మీరు భారీగా లాభం పొందే వీలుంది.