ఈ మధ్యకాలంలో అందరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతుంది. రాత్రివేళ అన్నం బదులుగా చపాతీలు, పుల్కాలు తినేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. డయాబెటిస్, బిపి, థైరాయిడ్, అధిక బరువుతో బాధపడే వారు రాత్రివేళ అన్నం తినడం మానేస్తున్నారు. వీరంతా నూనె లేకుండా కాల్చే పుల్కాలు అందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు చపాతీ, పుల్కాలనూ విక్రయిస్తే చక్కటి ఆదాయం లభిస్తుంది.