మల్లెపూలను మార్కెటింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. వీటిని విదేశాలకు సైతం ఎగుమతి చేస్తుంటారు. మల్లె సువాసనకు పెట్టింది పేరు. అత్తరుల తయారీలో కూడా మల్లెలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కావున మీరు సరైన మార్కెటింగ్ పద్ధతులను అవలంబిస్తే చక్కటి లాభాలను పొందవచ్చు. మీరు వ్యవసాయంతో పాటు మల్లెపూలను వివిధ పట్టణాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం పెంచుకుంటే నేరుగా మీరు ఆర్డర్లను పొందే అవకాశం ఉంటుంది. పెళ్లిళ్లు చేసే ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు, దేవాలయాలు, అలాగే రిటైల్ డీలర్లతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని. మీరు వారికి సకాలంలో మల్లెలను సప్లై చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందే వీలుంది డిమాండ్ ను బట్టి మీ పంట విస్తీర్ణం కూడా పెంచుకుంటే చక్కగా కలిసి వస్తుంది.
నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.