ముకేష్ అంబానీ కుటుంబం నివసించే యాంటిలియాలోనే ఈ కుక్క కూడా వారితో పాటు నివసిస్తోంది. అంబానీ కుటుంబంలో అనంత అంబానీ కి జంతువులంటే చాలా ప్రేమ. ఆయన వద్ద అనేక విదేశాలకు చెందిన పక్షులు, అదేవిధంగా కొన్ని పెంపుడు జంతువుల కలెక్షన్ ఉంది. వాటిల్లో ఈ గోల్డెన్ రిట్రీవర్ కుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. అంబానీ కుటుంబం నిర్వహించుకునే ప్రతి వేడుకల్లోనూ ఈ గోల్డెన్ రిట్రీవర్ కుక్క మనకు దర్శనం ఇస్తుంది.