Business Ideas: మహిళలు మీరు ఇల్లు కదలకుండా ప్రతి నెల రూ. 1 లక్ష తగ్గకుండా సంపాదించాలంటే ఈ పని చేయండి..

First Published | Aug 9, 2023, 2:29 PM IST

మహిళలు వ్యాపారం చేయడమే మీ ఉద్దేశమా అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి మహిళలు ఇంటి వద్ద చేసుకునే వ్యాపారం  ఒక వ్యాపారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  నిజానికి ఈ వ్యాపారం చేయడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు మీరు ఒక కోర్స్ నేర్చుకుంటే సరిపోతుంది.  ఆ కోర్స్ ఏంటో దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుత కాలంలో వివాహ శుభకార్యాలకు  మహిళలు ఎక్కువగా రెడీ అయ్యేందుకు మేకప్ ఆర్టిస్టులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మేకప్ ఆర్టిస్టులకు ప్రస్తుత కాలంలో మంచి డిమాండ్ ఏర్పడింది.  పెళ్లి సమయంలో   సాధారణంగా పెళ్లికూతురుతో పాటు పెళ్లి కుమారుడు సైతం మేకప్ చేయించుకుంటున్నారు.  అంతేకాదు ఇతర శుభకార్యాలకు వెళ్లేవారు సైతం ఈ మధ్యకాలంలో  మేకప్ ఆర్టిస్టుల ద్వారా మేకప్ చేయించుకుంటున్నారు
 

Money

మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ఎంచుకున్నట్లు అయితే మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది చదువుతో సంబంధం లేకుండానే మహిళలు ఈ కళ నేర్చుకోవడం ద్వారా  ఇంటి వద్ద ఉండి కూడా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 


Money

 మేకప్ ఆర్టిస్టులకు అటు సినిమా ఇండస్ట్రీలోనూ టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా డిమాండ్ ఉంది.  అందుకే ఈ రంగంలో ఆదాయానికి మంచి అవకాశాలు ఉన్నాయి.  మీరు  మేకప్ ఆర్టిస్టుగా రాణించాలి అనుకుంటే పలు సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద పెద్ద సంస్థలు సైతం ఈ కోర్సులను అందిస్తున్నాయి.  ఈ కోర్సు విలువ 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది.  అయితే మీరు అంత డబ్బు ఖర్చు చేయలేనప్పుడు  తక్కువ ఖర్చులోనే మేకప్ ఆర్టిస్టుగా కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.  అదేంటో తెలుసుకుందాం. 
 

 తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెట్విన్ సంస్థ యువతీ యువకుల కోసం ఉపాధి అవకాశం కల్పించే పలు కోర్సులను నేర్పిస్తున్నాయి.  అందులో భాగంగా మీరు అతి తక్కువ ఖర్చుకే పలు కోర్సులను నేర్చుకోవచ్చు.  సెట్విన్ సంస్థలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. 

 సెట్విన్ సంస్థలో అతి తక్కువ ధరలకే బ్యూటీషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  కేవలం 1500 రూపాయల నుంచే ఈ కోర్సులు ప్రారంభం అవుతున్నాయి.  పూర్తి వివరాల కోసం సెట్విన్ సంస్థ వెబ్సైట్  ఓపెన్ చేసి చూడవచ్చు. 
 

 సంస్థ డిప్లమా కోర్సులను సైతం ఆఫర్ చేస్తోంది.  ఈ డిప్లమా సర్టిఫికెట్ ద్వారా మీరు బ్యూటీ సెలూన్ ఓపెన్ చేయవచ్చు.  తద్వారా మీరు ప్రతి నెల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అంతేకాదు బ్యూటీషియన్ గా రాణించే అవకాశం ఉంది.  ప్రస్తుత కాలంలో సగటున బ్యూటీషియన్ ప్రతినెల 1 లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. 
 

Latest Videos

click me!