బిజినెస్ ఐడియా: ఉద్యోగంతో విసిగిపోయారా.. ఈ వ్యాపారంతో ప్రతిరోజూ 4 వేలు సంపాదించొచ్చు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 19, 2021, 05:22 PM IST

ఉద్యోగంలో స్థిరమైన సంపాదన ఉంటుంది ఇంకా పని భారం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఒక వ్యక్తి చాలా పరిమితం అవుతాడు. మరోవైపు వ్యాపారం(business)లో రిస్క్ కాస్త ఎక్కువగానే ఉన్నా లాభం మాత్రం చాలా బాగుంటుంది. అయితే అలాంటి బిజినెస్ ప్లాన్ తో ప్రతిరోజూ వేల రూపాయలు సంపాదించవచ్చు. 

PREV
14
బిజినెస్ ఐడియా: ఉద్యోగంతో విసిగిపోయారా.. ఈ వ్యాపారంతో ప్రతిరోజూ 4 వేలు సంపాదించొచ్చు..

మీరు ఉద్యోగం చేయడంతో విసిగిపోయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీరు ఈ అద్భుతమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ స్పెషల్ బిజినెస్ ఏంటంటే అరటిపండు చిప్స్ తయారు చేసి అమ్మాలి. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతిరోజూ 4 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. బనానా చిప్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది ఉపవాస సమయంలో కూడా దీనిని తీసుకుంటారు. దీంతో పాటు బనానా చిప్స్‌కు మార్కెట్‌లో డిమాండ్‌ చాలా ఎక్కువ.  ఈ ప్రత్యేక బిజినెస్ ప్రణాళిక గురించి తెలుసుకుందాం..

24

భారతదేశంలో చాలా మంది బనానా చిప్స్ వ్యాపారం చేస్తున్నారు. అయితే బనానా చిప్స్ మార్కెట్ సైజ్ చిన్నది. అందుకే చాలా పెద్ద కంపెనీలు దీన్ని తయారు చేయడం లేదు. ఇలాంటి సమయంలో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మంచి మొత్తాన్ని సంపాదించవచ్చు. 

34

బనానా చిప్స్ చేయడానికి మీకు కొన్ని వస్తువులు మాత్రమే అవసరం. వాటిని తయారు చేయడానికి పచ్చి అరటిపండ్లు, ఉప్పు, తినదగిన నూనె, కొన్ని రకాల మసాలాలు అవసరం. అలాగే మీకు అరటిపండు వాషింగ్ ట్యాంక్, పీలింగ్ మెషిన్, అరటిపండు స్లైసర్, ఫ్రైయింగ్ మెషిన్, మసాలా మిక్సింగ్ మిషన్, పౌచ్ ప్రింటింగ్ మెషిన్, లేబొరేటరీ ఎక్విప్మెంట్ కూడా అవసరం. 

44

50 కిలోల అరటిపండు చిప్స్‌ తయారు చేసేందుకు రూ.3200 ఖర్చవుతుంది. మార్కెట్‌లో మనం 1 కేజీ అమ్మి  రూ.10 లాభం పొందితే, ఒక రోజులో రూ.4000 వరకు సులభంగా సంపాదించవచ్చు. మీ అమ్మకాలు బాగుంటే ఈ వ్యాపారం ద్వారా మీరు నెలలో 1 లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు.

click me!

Recommended Stories