క్రిప్టోకరెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. తప్పుడు చేతుల్లోకి వెళ్లకూడదు అంటూ..

First Published Nov 18, 2021, 5:26 PM IST

గురువారం సిడ్నీ డైలాగ్‌ (sydney dialogue)వర్చువల్ కీనోట్ లో  ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)క్రిప్టోకరెన్సీలకు వ్యతిరేకంగా అన్ని దేశాలను హెచ్చరిస్తూ, ఈ డిజిటల్ కరెన్సీ(digital currency) తప్పుడు చేతుల్లోకి రాకుండా మనం కలిసి శ్రద్ధ వహించాలి అని అన్నారు. దీన్ని నిర్ధారించేందుకు క్రిప్టోకరెన్సీ(cryptocurrency)లపై అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని కోరారు.

 ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై  భారీగా ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీను ఆదరిస్తోన్న దేశాల్లో భారత్‌ కూడా ముందు స్థానాల్లో నిలుస్తోంది. భారత్‌లో సుమారు 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. 


బిట్‌కాయిన్‌ను ఉదాహరణగా చూపుతూ
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిడ్నీ డైలాగ్‌ వర్చువల్ కీనోట్లో ప్రసంగించారు. బిట్‌కాయిన్‌ను ఉదాహరణగా చూపుతూ, క్రిప్టోకరెన్సీల వంటి టెక్నాలజి ఆవిష్కరణలను దుర్వినియోగం చేయరాదని ప్రధాని మోదీ అన్నారు. అందుకే మన యువతను పాడుచేసే బిట్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం.

ప్రధాని మోడీ ప్రసంగం - దుర్వినియోగాన్ని అరికట్టడం అవసరం
దుర్వినియోగాన్ని అరికట్టడానికి అవసరమైన టెక్నాలజి ప్రపంచ పోటీకి ప్రధాన సాధనంగా మారింది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రమాన్ని రూపొందించడంలో కీలకమైనది. టెక్నాలజి, డేటా కొత్త ఆయుధాలుగా మారుతున్నాయని ప్రధాని అన్నారు. డెమోక్రసికి గొప్ప బలం బహిరంగత. ఈ బహిరంగతను దుర్వినియోగం చేయడానికి స్వార్థ ప్రయోజనాలను మనం అనుమతించకూడదు.  

క్రిప్టోకరెన్సీ చర్చలు భారతదేశంలో జోరుగా సాగుతున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ దీనిని పెను ముప్పుగా అభివర్ణించగా, మరోవైపు ఇటీవల జరిగిన పార్లమెంటరీ ప్యానెల్‌ సమావేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించలేమని, దానిని నియంత్రించే మార్గాలను అన్వేషించడమే తదుపరి చర్య అని చర్చ జరిగింది.

దేశంలో క్రిప్టో భవిష్యత్తు బంగారుమయం 
అమెరికా లాగానే భారత్‌లోనూ బిట్‌కాయిన్‌ భవిష్యత్తు బంగారుమయం కానుందని అంటున్నారు నిపుణులు.  క్రిప్టో గురించి అవగాహన కల్పించడానికి, దాని సాంకేతికతను అర్థం చేసుకోవడానికి భారతదేశానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే భారత్‌లోని పెట్టుబడిదారులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. 

click me!