బిజినెస్ ఐడియా: కేవలం రూ.2 లక్షల పెట్టుబడితో నెలకు రూ.50 వేల ఆదాయం పొందే వ్యాపారం ఇదే..ప్రభుత్వం రుణం ఇస్తుంది

First Published Sep 24, 2022, 4:00 PM IST

కేంద్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ముద్రా రుణాలు దేశవ్యాప్తంగా అనేకమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.

సొంత కాళ్ళ మీద నిలబడేందుకు వ్యాపారాన్ని ప్రారంభించేందుకు, అలాగే చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఈ ముద్రా రుణాలు చాలా ఉపయోగపడుతున్నాయి.
 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ముద్రా రుణ పథకం వల్ల 50 వేల నుంచి పది లక్షల వరకు రుణాలు పొందే వీలుంది. అన్ని ప్రభుత్వ సహకార బ్యాంకులో అలాగే ఇతర షెడ్యూల్డ్ బ్యాంక్స్ ద్వారా కూడా ఈ ముద్రా రుణాలను పొందవచ్చు.

ఇదిలా ఉంటే ముద్ర రుణం పొంది మీరు ఏ వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా.. ఫుడ్ బిజినెస్ లో చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది ప్రస్తుతం యువత అలాగే అన్ని వయస్సులవారు చిరుతొల్లు తినేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణాల్లో సైతం జనం చిరుతులకు అలవాటు పడ్డారు బిజీ లైఫ్ లో ఇళ్లల్లోనే చిరుతిళ్లు తయారు చేసుకోవడం చాలా చాలా కష్టమైపోతోంది ఈ నేపథ్యంలో మీ ఇంట్లో పిల్లలు చిరుతుల్లు కావాలని మారాం చేస్తే బయట నుంచి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది దీన్నే మీరు వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు .
 

హాట్ చిప్స్ పేరిట ఆలుగడ్డ అరటికాయ అలాగే ఇతర చిప్స్ తయారు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. పిల్లలు పెద్దలు అలాగే అన్ని వయసులవారు ఆలోచిస్తే తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లోని బడా కార్పొరేట్ సంస్థలైనటువంటి పెప్సీ సహా  అలాగే ఇతర కార్పొరేట్ సంస్థలు ఈ హార్ట్ చిప్స్ రంగంలో చక్కటి మార్కెట్ వాటాను పొంది ఉన్నాయి. అయితే మీరు మీ స్వస్థలంలోనే తాజాగా ఈ హాట్ చిప్స్ తయారు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముందుగా హాట్ చిప్స్ తయారీకి ఎంత పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.
 

హాట్ చిప్స్ తయారీకి ఒక షాపును అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా జన సమర్థత ఉన్న ప్రదేశాలు కానీ మార్కెట్ అలాగే నివాసాలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఈ హాట్ చిప్స్ వ్యాపారం చేస్తే సరిగ్గా క్లిక్ అవుతుంది. ముఖ్యంగా మీరు షాపును అద్దెకు తీసుకున్న తర్వాత హాట్ చిప్స్ వ్యాపారానికి తగినట్లుగానే ఫర్నిచర్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. షాపు ముందరే మీరు తాజాగా చిప్స్ వేయించుకోవడానికి ఒక స్టవ్ బాణలి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక హాట్ షిప్స్ తయారీ కోసమని మార్కెట్ నుంచి ఆలుగడ్డలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆలుగడ్డలను హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేస్తే ధర కొంచెం తక్కువగానే వస్తుంది. అలాగే ముడి సరుకు దాచుకునేందుకు షాపులో కొంత భాగం కేటాయించాల్సి ఉంటుంది. అదేవిధంగా షాపులో ఇతర చిరుతిళ్లను అమ్ముకునేందుకు ఫర్నీచర్ తో ఏర్పాట్లు  చేయించుకోవాలి.
 

ఇక హాట్ చిప్స్ తయారీలో అత్యంత ముఖ్యమైనది వంటనూనె, దీన్ని హోల్ సేల్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి. అయితే వంట నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యత లేకపోతే మీ సరుకు పాడైపోయే ప్రమాదం ఉంది. నాణ్యతలేని వంట నూనెలో హాట్ చిప్స్ తయారు చేస్తే దుర్వాసన  వచ్చే అవకాశం ఉంది. మీ సరుకు చాలా త్వరగా పాడైపోవచ్చు. అదే నాణ్యమైన వంటనూనె వాడితే మీ సరుకు కొన్ని రోజులపాటు చక్కటి వాసనతో  పాడైపోకుండా నిల్వ చేసుకోవచ్చు.
 

ఇక హాట్ చిప్స్ షాపులో కొన్ని స్వీట్లు కూడా తయారు చేసి అమ్మవచ్చు ఉదాహరణకు మైసూర్ పాక్, పల్లి చిక్కి, అలాగే ఎక్కువ కాలం నిలువ ఉండే డ్రై స్వీట్స్ ను మీరు తయారు చేసి ఇందులో విక్రయించవచ్చు. ఆలుగడ్డతోపాటు అరటికాయ చిప్స్ ను కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కావున అరటికాయ చిప్స్ కూడా తయారు చేసి విక్రయించవచ్చు.

ఈ వ్యాపారం పెట్టుబడికి సుమారు రెండు లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ డబ్బులు మీరు ముద్రా రుణం ద్వారా పొందవచ్చు. ఇక ప్రతి నెల మీకు సుమారుగా 50వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

click me!