Multibagger Stock: ఈ స్టాక్ లో 5 ఏళ్ల క్రితం జస్ట్ రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే..నేడు కోటీశ్వరులు..

First Published Sep 22, 2022, 2:32 PM IST

స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ లాటరీ టిక్కెట్ల కన్నా అద్భుతమైన రిటర్న్ ఇస్తాయి. అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్ అయిన Jyoti Resins and Adhesives Ltd గురించి తెలుసుకుందాం. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో, కేవలం 5 సంవత్సరాలలో 6,800 శాతం పెరిగింది.

5 సంవత్సరాల క్రితం జ్యోతి రెసిన్ (Jyoti Resins and Adhesives Ltd) స్టాక్ ధర రూ. 25 మాత్రమే. అయితే అది ఇప్పుడు రూ. 1,725కి అమాంతం పెరిగింది. ఇటీవల కంపెనీ పెట్టుబడిదారులకు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను కూడా ఇచ్చింది. జ్యోతి రెసిన్ స్టాక్ (Jyoti Resins and Adhesives Ltd) గురువారం కూడా పెరుగుతూనే ఉంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.17 శాతం పెరిగి రూ.1,725కి చేరుకుంది.

ఈ స్టాక్ 1 నెలలో 54 శాతం లాభపడింది. ఆగస్టు 22న ఈ షేరు ధర రూ.1118.67. అదేవిధంగా గత 6 నెలల్లో ఈ స్టాక్ 162.74 శాతం జంప్ చేసి రూ.656.57 నుంచి రూ.1,725కి పెరిగింది. అదేవిధంగా, 2022 సంవత్సరంలో ఇప్పటివరకు, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 362 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. 3 జనవరి 2022న ఈ షేరు ధర రూ. 373 గా నమోదైంది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 546 శాతం పెరిగింది. 5 సంవత్సరాలలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 6,800 శాతం రాబడిని ఇచ్చింది. జ్యోతి రెసిన్స్ అండ్ అడెసివ్స్ లిమిటెడ్ (Jyoti Resins and Adhesives Ltd) 17 డిసెంబర్ 1993న స్థాపించారు. ఇది గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉంది. 

జ్యోతి రెసిన్‌ల స్టాక్ 5 సంవత్సరాలలో పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసింది. ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు అతను రూ. 262,729 పొందేవాడు. అదేవిధంగా, ఎవరైనా 1 సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి తన పెట్టుబడిని కొనసాగించినట్లయితే, ఈ రోజు అతని పెట్టుబడి విలువ 6,46,672 రూపాయలకు పెరిగింది. ఈ స్టాక్ ఐదేళ్లలో 6,800 శాతం రాబడిని ఇచ్చింది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. ఏషియా నెట్ ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ లకు లోబడి ఉంటాయి. మీరు వీటిలో దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, దయచేసి ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని సంప్రదించండి.)

click me!