బంగారం ధర దీపావళి నాటికి భారీగా పెరిగే చాన్స్, తులం పసిడి రూ.60 వేలు దాటుతుందా..

First Published Sep 21, 2022, 7:52 PM IST

ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి లాంటి పండుగలు వరుసగా ఉన్నాయి. అలాగే ఈ సీజన్లోనే ధన త్రయోదశి సైతం ఉంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.

గత రెండు సంవత్సరాలుగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆభరణాల వర్తకులు భారీగా నష్టపోయారు. సేల్స్ లేకపోవడంతో ఆభరణాల తయారీదారులకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే గత సంవత్సర కాలంగా మాత్రం కరోనా కేసులు తగ్గటంతో పాటు బంగారం ధరలు కూడా భారీగా పెరగడం నేపథ్యంలో ఆభరణాల మార్కెట్ మరోసారి పుంజుకుంది.
 

అయితే తాజాగా బంగారం ధరలో మరోసారి పెరగడం ప్రారంభించాయి. గతంలో 56 వేల వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసిన బంగారం ప్రస్తుతం 52వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం ధర త్వరలోనే 10 గ్రాముల ధర 60 వేల రూపాయలు వెళ్ళినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. త్వరలోనే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2000 డాలర్లు తాకి అవకాశం ఉందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక ఔన్స్ బంగారం అంటే సుమారు 32 గ్రాములు ఈ లెక్కన చూస్తే దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 1660 డాలర్లుగా ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే బంగారం ధర 1800 డాలర్లు చేరుకునే అవకాశం ఉందని అక్కడి నుంచి రెండువేల దాల స్థాయిని తాకిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దేశీయంగా చూసినట్లయితే కూడా బంగారం ధరలో ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది ప్రస్తుతం 501 వేల నుంచి 52,000 సమీపంలో ట్రేడ్ అవుతున్న బంగారం ధరలు త్వరలోనే 53000 స్థాయికి తాకే అవకాశం ఉందని, అలాగే ఫెస్టివల్ ముగిసే సమయానికి అంటే ఈ సంవత్సరం చివరి నాటికి రూ. 60000 తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
 

ప్రస్తుతం బంగారం పెరుగుదల నేపథ్యంలో కేడియా అడ్వైజరీ డైరెక్టర్, కమోడిటీ నిపుణుడు అజయ్ కేడియా  మాట్లాడుతూ,  ప్రపంచ మార్కెట్‌లో బంగారం మునుపటి నిబంధనల ప్రకారం నడుస్తోంది. భారతీయ బులియన్ మార్కెట్లో ఫ్యూచర్స్, స్పాట్ ధర రెండు రేట్లపై ఒత్తిడి ఉంది. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో MCXలో బంగారం ఫ్యూచర్స్ ధర రూ.49,153గా నమోదైంది. గతేడాది రికార్డు ధర కంటే దాదాపు 7 వేల రూపాయలు తక్కువగా నడుస్తోంది. ఈ ధర గ్లోబల్ మార్కెట్ ద్వారా కూడా ప్రభావితమవుతుంది.
 

మరోవైపు బులియన్ మార్కెట్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని, ఢిల్లీలోని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ చెప్పారు. బంగారం ఇప్పటికే దాని విలువ కంటే చాలా ఎక్కువ పెరిగిందని, ఇప్పుడు దిగివచ్చే వంతు వచ్చిందని అంచనా వేస్తున్నారు. దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం దానిపై ఒత్తిడి తెచ్చింది. బంగారం అమ్మకాలు పెద్దగా పెరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం బంగారం ధర ఇది 48,000 నుండి 52,000 మధ్య ఉంటుంది, అయితే దీని ధర 40 నుండి 45 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.

click me!