Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం

Published : Dec 08, 2025, 11:18 AM IST

Business Idea: ఇటీవ‌ల వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. యువ‌త కొత్త మార్గాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ప్లాన్స్‌లో చేప‌ల పెంప‌కం ఒక‌టి. కేవ‌లం చెరువుల్లో కాకుండా, ఇంట్లోనే చేప‌లు పెంచుతూ లాభాల‌ను ఆర్జిస్తున్నారు. 

PREV
15
మారుతున్న చేపల పెంపకం విధానం

కొర‌మీను చేప‌ల‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఇంటి ఆవ‌ర‌ణ‌లో, మేడ‌పై ఖాళీ స్థ‌లంలో ట్యాంకుల‌ను ఏర్పాటు చేసుకుని చేప‌ల‌ను పెంచుతున్నారు. తక్కువ స్థలం, తక్కువ నీటి వినియోగంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు.

25
చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు

ఆరు నెలలకు ఒకసారి క్రాప్ వ‌స్తుంది. ముందుగా నాలుగు, ఐదు అంగుళాల పిల్ల చేప‌ల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 6 నెలల్లో మంచి బరువు పెరుగుతాయి. తక్కువ మోర్టాలిటీ ఉండేలా సరైన ఫీడ్ అందించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

కొరమీను చేపల పెంపకానికి ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలు ఇస్తోంది. బ్యాంకు లోన్లు, యూనిట్‌ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫీడ్‌ సరిగ్గా అందిస్తే నష్టానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్ర‌స్తుతం మార్కెట్లో కొర‌మీనుకు మంచి డిమాండ్ ఉంది.

35
బిజినెస్ ఎలా ప్రారంభించాలి

కొత్తగా ఈ వ్యాపారం చేయాలనుకునే వారికోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌..

Step 1: చిన్న స్థలంలో ట్యాంక్/గుంట ఏర్పాటు

* 10×10 అడుగుల ట్యాంక్ కూడా సరిపోతుంది

* ఇది సిమెంట్ ట్యాంక్, టార్పాలిన్ ట్యాంక్ కావొచ్చు

Step 2: శుద్ధ నీరు నిల్వ చేసేందుకు చిన్న మోటారు

* నీరు తరచుగా మార్చాల్సిన పని లేదు

* సర్క్యులేషన్ ఉండటం సరిపోతుంది

Step 3: చేప పిల్లల కొనుగోలు

* 4 నుంచి 6 అంగుళాల పిల్లలు తీసుకుంటే పెరుగుదల వేగంగా ఉంటుంది

Step 4: ఫీడ్‌ నిర్వహణ

* ఉదయం, సాయంత్రం ఒక్కోసారి ఇస్తే సరిపోతుంది

* మంచి ఫీడ్‌ వాడితే బరువు పెరుగుదల వేగం పెరుగుతుంది

Step 5: అమ్మకాల ప్రణాళిక

స్థానిక మార్కెట్‌తో పాటు పట్టణాల్లో హోటళ్లకు స‌ర‌ఫ‌రా చేయొచ్చు. హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లలో కూడా నేరుగా విక్ర‌యించ‌వ‌చ్చు.

45
బిల్డింగ్ పై ట్యాంక్స్‌లో కొరమీను పెంపకం

ఇప్పుడు గ్రామాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ప్రజలు బిల్డింగ్ పై చేపలు పెంచడం మొదలుపెట్టారు. ఈ విధానం ప్రత్యేకంగా లైట్ వెయిట్ నిర్మాణాలకు చాలా సురక్షితం.

55
బిల్డింగ్ మీద ఎలా ప్రారంభించాలి?

టార్పాలిన్ ట్యాంకుల ఏర్పాటు చేయాలి. బరువు తక్కువ ఉండి త‌క్కువ ధ‌ర ఉండేవి చూసుకోవాలి. 500 లీటర్ల నుంచి 5,000 లీటర్ల వరకూ ట్యాంకులు అందుబాటులో ఉంటాయి. బిల్డింగ్‌పై నీటి లీకేజ్‌ రాకుండా కింద మ్యాట్ వేయాలి. ప్లాస్టిక్ షీట్, రబ్బరు మ్యాట్ అవ‌స‌ర‌ప‌డ‌తాయి. రూఫ్‌టాప్‌లో గాలి ఎక్కువగా లభిస్తుంది, కానీ ట్యాంక్‌కు ప్రత్యేక ఆక్సిజన్ లైన్ ఇవ్వడం లాభదాయకం. బిల్డింగ్ పై సూర్యరశ్మి ఎక్కువగా ఉండటంతో ట్యాంక్ ఆఫ్ భాగం షేడ్ నెట్‌తో కవర్ చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories