Business Idea: రూ. 5 వేల పెట్టుబ‌డితో వేల‌లో సంపాద‌న‌.. పోస్టాఫీస్ ఫ్రాంచైజీ 2.0తో ఉన్న ఊరిలోనే మంచి ఆదాయం

Published : Jan 22, 2026, 09:18 AM IST

Business Idea: ఉన్న ఊరిలో ఉంటూ వ్యాపారం చేసుకోవాల‌ని చాలా మంది కోరుకుంటారు. అందులోని ఎలాంటి రిస్క్ లేకుండా త‌క్కువ పెట్టుబ‌డితో మంచి లాభాలు రావాల‌ని భావిస్తుంటారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ బిజినెస్ అవకాశం

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖ మంచి అవకాశం అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా తక్కువ పెట్టుబడితో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వ మద్ధతు ఉండటంతో రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.

25
ఫ్రాంచైజీ అంటే ఏమిటి?

పోస్టాఫీస్ లేని ప్రాంతాలు లేదా రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల పోస్టల్ సేవలను అందించేందుకు ఫ్రాంచైజీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పోస్టల్ శాఖ అనుమతితో ఈ అవుట్‌లెట్ నడపాలి. ప్రజలకు తపాలా సేవలు అందిస్తే ప్రతి లావాదేవీపై కమిషన్ లభిస్తుంది. ఇది ఏటీఎం లేదా పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీ తరహా బిజినెస్ మోడల్.

35
అందుబాటులో ఉన్న రెండు అవకాశాలు

ఈ పథకంలో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి.

ఫ్రాంచైజీ అవుట్‌లెట్: స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్లు, స్టాంపుల విక్రయం వంటి కౌంటర్ సేవలు నేరుగా నిర్వహించవచ్చు.

పోస్టల్ ఏజెంట్ విధానం: పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ విక్రయించి ఆదాయం సంపాదించవచ్చు.

45
పెట్టుబడి ఎంత? ఆదాయం ఎంత?

ఈ వ్యాపారం ప్రారంభించేందుకు కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చాలు. రిజిస్టర్డ్ పోస్ట్‌పై రూ.3 కమిషన్, స్పీడ్ పోస్ట్‌పై రూ.5 కమిషన్, మనీ ఆర్డర్లపై రూ.3.50 నుంచి రూ.5 వరకు లభిస్తుంది. నిర్ణీత లక్ష్యాన్ని చేరుకున్నవారికి అదనంగా 20 శాతం ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. వినియోగదారుల రద్దీ బట్టి నెలకు సుమారు రూ.50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

55
అర్హతలు, దరఖాస్తు విధానం

ఈ ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. భారత పౌరుడై ఉండాలి. పోస్టల్ శాఖ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ అవకాశం ఉండదు. ఆసక్తి ఉన్నవారు సమీప ప్రధాన పోస్టాఫీస్‌లో దరఖాస్తు ఫామ్‌ తీసుకుని, ఆధార్, పాన్, విద్యార్హత పత్రాలతో సమర్పించాలి. ఎంపికైన వారికి పోస్టల్ శాఖ శిక్షణ కూడా ఇస్తుంది. తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories