Business Idea: స‌రిగ్గా 3 నెల‌లు క‌ష్ట‌ప‌డితే చాలు.. ల‌క్షాధికారి కావ‌డం ఖాయం. లైఫ్ చేంజింగ్ బిజినెస్‌

Published : Jan 02, 2026, 03:34 PM IST

Business Idea: చ‌దువు పూర్త‌య్యాక ఉద్యోగం చేసి ఆ త‌ర్వాత వ్యాపారం చేయాల‌నే ఆలోచ‌న ఉండేది. ప్ర‌స్తుతం చ‌దువు పూర్తికాగానే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. సీజ‌న‌ల్ వ్యాపారంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అలాంటి ఓ మంచి ఐడియా గురించి చెప్పుకుందాం. 

PREV
15
తక్కువ పెట్టుబడితో భవిష్యత్తు మార్చే వ్యాపారం

ఈ రోజుల్లో ఉద్యోగంతో పాటు స్వంత వ్యాపారం చేయాలనే ఆలోచన యువతలో బలంగా కనిపిస్తోంది. స్థిరమైన ఆదాయం కోసం చిన్న పెట్టుబడితో ప్రారంభించగల వ్యాపారాల వైపు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపారం అంటే నష్టమే అన్న భయం చాలామందిలో ఉన్నా, సరైన ప్లాన్‌తో మొదలుపెడితే క‌చ్చితంగా లాభాలు ఉంటాయి. అలాంటి ఓ మంచి అవకాశమే ఐస్ క్యూబ్ తయారీ వ్యాపారం.

25
సమ్మర్‌లో ఐస్‌కు డిమాండ్ ఎందుకు పెరుగుతుంది?

వేసవికాలం మొదలైతే చల్లటి పానీయాల వినియోగం భారీగా పెరుగుతుంది. జ్యూస్ షాపులు, సోడా బండ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్‌ అన్నీ ఐస్ క్యూబ్స్‌పై ఆధారపడతాయి. ఎండ ఎక్కువగా ఉండే కాలంలో ఐస్ లేకుండా వ్యాపారం నడపడం కష్టం. అందుకే ఈ రంగంలో డిమాండ్ ప్రతి ఏడాది సమ్మర్‌లో ఒక్కసారిగా పెరుగుతుంది.

35
ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీకి అవసరమైన ఏర్పాట్లు

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా సంబంధిత ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఐస్ తయారీ కోసం ఒక పెద్ద గది ఉండాలి. అక్కడ నిరంతర విద్యుత్ సరఫరా, శుద్ధి చేసిన నీరు తప్పనిసరి. ఐస్ క్యూబ్స్ తయారీకి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చిన్న మిషన్లు లేదా ఫ్రీజర్లు సరిపోతాయి. ఆకర్షణీయమైన ఆకారాల్లో ఐస్ తయారు చేసే సదుపాయాలు కూడా ఉన్నాయి.

45
రూ. లక్ష పెట్టుబడితో ఎలా ప్రారంభించాలి?

ఈ వ్యాపారాన్ని సుమారు రూ. లక్ష పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు.

ఫ్రీజర్ లేదా ఐస్ మిషన్‌ కోసం సుమారు రూ. 50,000

ఇతర అవసరమైన పరికరాలు, నీటి ఫిల్టర్, ట్రేలు, ప్యాకింగ్ సామగ్రి కోసం మరో రూ. 50,000

ఒకసారి ఈ ఏర్పాట్లు పూర్తయితే తర్వాత ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ప్రధానంగా విద్యుత్ బిల్, నీటి ఖర్చు మాత్రమే ఉంటుంది.

55
నెలకు ఎంత ఆదాయం రావచ్చు?

ఆరంభ దశలోనే నెలకు కనీసం రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పెళ్లిళ్ల సీజన్‌లో లేదా సమ్మర్ పీక్ టైమ్‌లో ఈ ఆదాయం రూ. 50,000 వరకు చేరవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో కస్టమర్లే నేరుగా వచ్చి ఐస్ కొనుగోలు చేస్తారు. డెలివరీ ఖర్చు పెద్దగా ఉండదు. రిస్క్ తక్కువగా ఉండే వ్యాపారాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.

సీజనల్ డిమాండ్ ఉన్నా, సంవత్సరమంతా నడిచే వ్యాపారం కావడం ఈ ఐడియా ప్రత్యేకత. చిన్న పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా విస్తరించే అవకాశం ఉంటుంది. వచ్చే సమ్మర్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పుడే ప్లాన్ చేస్తే మంచి లాభాలు అందుకోవచ్చు.

గ‌మ‌నిక: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం కోసం మాత్ర‌మే. పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణులు, ఇప్ప‌టికే ఈ వ్యాపారంలో అనుభ‌వం ఉన్న వారి స‌లహాలు తీసుకోవ‌డం ఉత్త‌మం.

Read more Photos on
click me!

Recommended Stories