Business Ideas: కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర రుణంతో వ్యాాపారం చేస్తారా, అయితే ఈ ఐడియా మీ కోసం..

First Published Nov 4, 2022, 4:04 PM IST

సొంత కాళ్లపై వ్యాపారం చేసి నిలబడాలని అనుకుంటున్నారా.  అయితే ఫ్రాంచైజీ ద్వారా డైరీ పార్లర్ స్థాపించి వ్యాపారం చేయడం ద్వారా  ప్రతినెల చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

వ్యాపారం చేయడమే మీ లక్ష్యమా...అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యువత అభ్యున్నతి కోసం సొంత కాళ్లపై నిలబడేందుకు ముద్ర రుణాలను ప్రవేశపెట్టింది. ఈ ముద్ర రుణాల ద్వారా లక్షలాది మంది యువత సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఈ ముద్ర రుణాలను ప్రభుత్వ బ్యాంకులలో మూడు కేటగిరీలో ఇస్తారు. శిశు ముద్ర రుణాల కింద  50 వేల వరకు రుణం పొందవచ్చు.  కిషోర్ రుణాలు 50 వేల నుంచి ఐదు లక్షల వరకు రుణాలను పొందవచ్చు.  తరుణ్  రుణాల కింద 10 లక్షల వరకూ లోన్ పొందే వీలుంది.

ఈ రుణాలను  నిరుద్యోగ యువతరం,  ఇప్పటికే చేస్తున్న వ్యాపారం మరింత విస్తరించేందుకు,  కొత్త వ్యాపారం స్థాపించేందుకు, లేదా మరే ఇతర  వ్యాపార  భాగస్వామ్య పెట్టుబడి కైనా  మీరు ఈ డబ్బును వినియోగించుకోవచ్చు. అయితే ఈ ముద్ర రుణాల ద్వారా ఏ వ్యాపారం చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి. 
 

ప్రతి రోజూ ప్రతి ఇంట్లోనూ వాడే నిత్యవసర వస్తువు పాలు, ప్రస్తుతం సిటీలో అలాగే చిన్న నగరాలు పట్టణాల్లో పాలు పాల ఉత్పత్తులను కొనేందుకు డైరీ పార్లర్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. మీరు కూడా డైరీ పార్లర్ ను ప్రారంభించాలని అనుకుంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లాభదాయకంగా ఉంటుంది నెలకు ఎంత సంపాదించవచ్చు తెలుసుకుందాం. 

ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి డైరీ కంపెనీలు ప్రధానంగా అమూల్, హెరిటేజ్, మదర్ డెయిరీ, సంగం, ఆరోక్య  తదితర సంస్థలు డైరీ పార్లర్ స్థాపించేందుకు ఫ్రాంచైజీ మోడల్ ఆఫర్ చేస్తున్నాయి.  ఈ సంస్థ ప్రారంభించేందుకు ఓకే సారీ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా ఈ డైరీ ఫ్రాంఛైజీల ను తీసుకోవడం ద్వారా,  మీకు ఆ సంస్థ ఉత్పత్తులను విక్రయించేందుకు వీలు కలుగుతుంది అంతేకాదు ఆ సంస్థ నుంచి మీకు నిరంతరం పాల ఉత్పత్తులు నేరుగా సప్లై పొందే అవకాశం ఉంటుంది. 

ఆయా కంపెనీల ఫ్రాంచైజీలు సుమారు రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీలు తీసుకోవడం ద్వారా మీరు కంపెనీ డిజైన్ ద్వారా షాపును నిర్మించాల్సి ఉంటుంది.  అలాగే కంపెనీ నుంచే సైన్ బోర్డు,  ఐస్ క్రీమ్, పాలను స్టోర్ చేసుకునేందుకు రిఫ్రిజిరేటర్ సైతం లభిస్తాయి. ఈ ప్రాంచైజీ మోడల్ ద్వారా  వ్యాపారం ప్రారంభిస్తే,  అప్పటికే మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంస్థ కావడంతో, మీ ఉత్పత్తులకు ప్రత్యేకంగా ఎలాంటి పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. 

తద్వారా మీకు మంచి లాభం పొందే వీలుంది.  అంతేకాదు ఫ్రాంచైజీ వ్యాపారం చేయడం ద్వారా మీకు కంపెనీ నుంచి ప్రత్యేకంగా రాయితీ పొందే అవకాశం ఉంటుంది.  ముద్ర రుణం పొంది ఇలాంటి ఫ్రాంచైజీ వ్యాపారం చేయడం ద్వారా,  ప్రతి నెల చక్కటి ఆదాయం పొందే వీలుంది.  పాలు మిల్క్ ప్రొడక్ట్స్ కు నిరంతరం డిమాండ్ ఉంటుంది.  దీన్ని మీరు  ఒక వ్యాపార అవకాశంగా మలుచుకుని సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఉంది. 

Disclaimer: పైన పేర్కొన్న వ్యాపార సలహా కేవలం పాఠకుల అవగాహన కొరకు మాత్రమే.  మీరు చేసే పెట్టుబడులకు వ్యాపారాలకు ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.  ఒకవేళ మీరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే సంబంధిత నిపుణులను అడిగి పూర్తి విషయాలు తెలుసుకోవడం మంచిది. 

click me!