Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. ఒక్క‌సారి పెట్టుబ‌డి పెడితే 30 ఏళ్లు ఆదాయం ఖాయం

Published : Dec 24, 2025, 12:20 PM IST

Business Idea: ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయంపై ఆస‌క్తిపెరుగుతోంది. ముఖ్యంగా వాణిజ్య పంట‌ల‌తో మంచి లాభాల‌ను ఆర్జిస్తున్నారు. అయితే వ్య‌వ‌సాయం అంటే ఎక్కువ స్థ‌లం ఉండాల‌నే ఆలోచ‌న మ‌న‌లో ఉంటుంది. కానీ త‌క్కువ స్థ‌లంలో కూడా ఎక్కువ ఆదాయం వ‌చ్చే పంటలు వేయొచ్చు. 

PREV
15
100 గజాల్లో కొబ్బరి చెట్ల పెంపకం

చిన్న భూమిలో దీర్ఘకాలిక ఆదాయం అందించే వ్యవసాయ ఆలోచనల్లో కొబ్బరి చెట్ల పెంపకం ఒకటి. కొబ్బ‌రి బోండాల‌కు పెరుగుతోన్న డిమాండ్ ఈ వ్యాపారంవైపు మొగ్గు చూపేందుకు కార‌ణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా 100 గజాల స్థలంలో కూడా ఈ బిజినెస్ సాధ్యమే. సరైన ప్రణాళికతో సాగు చేస్తే స్థిరమైన లాభాలు పొందొచ్చు.

25
100 గజాల్లో ఎన్ని కొబ్బరి చెట్లు నాటొచ్చు?

100 గజాలు అంటే సుమారు 900 చదరపు అడుగుల స్థలం. సాధారణంగా కొబ్బరి చెట్లకు 7 అడుగుల నుంచి 8 అడుగుల దూరం అవసరం. 100 గజాల్లో సగటున 8 నుంచి 10 కొబ్బరి చెట్లు నాటొచ్చు డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే స్థలం మరింత ఉపయోగపడుతుంది. డ్వార్ఫ్ వెరైటీ మొక్కలు తీసుకుంటే త్వరగా దిగుబడి వస్తుంది. చిన్న స్థలంలో సాగు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

35
ఒక్కో చెట్టుకు ఎన్ని కాయలు వస్తాయి? ఎంత సమయం పడుతుంది?

డ్వార్ఫ్ లేదా హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు నాటిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల్లో కాయలు రావడం మొదలవుతుంది. ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 80 నుంచి 120 కాయలు దాకా వస్తాయి. ప్రతి 45 రోజులకు ఒకసారి కోత సాధ్యం. సరైన సంరక్షణ ఉంటే దిగుబడి మరింత పెరుగుతుంది. ఇది దీర్ఘకాల పెట్టుబడిగా మారుతుంది.

45
పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా ఉంటాయి?

ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉండదు. ఒక్కో మొక్క ధర రూ.300 నుంచి రూ.600 ఉంటుంది. 10 మొక్కలకు ఖర్చు సుమారు రూ.5,000 అవుతుంది. సంవత్సరానికి మొత్తం కాయలు సుమారు 800 నుంచి 1,000 కాయ‌లు వ‌స్తాయి. ఒక్కో కొబ్బరి ధర – రూ.25 నుంచి రూ.40 ఉంటాయి. ఇలా చూసుకుంటే ఏంటా సుమారు రూ. 40 వేల వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు. కాలక్రమేణా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.

55
కొబ్బరి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి?

మార్కెటింగ్ పెద్ద సమస్య కాదు. స్థానిక కూరగాయల మార్కెట్లు, టెండర్ కొబ్బరి విక్రయం, హోటళ్లు, జ్యూస్ సెంటర్ల వంటి వాటిలో నేరుగా విక్ర‌యించ‌వ‌చ్చు. లేదంటే వాట్సాప్ గ్రూపులు, స్థానిక కాంటాక్ట్స్ ద్వారా అమ్మకాలు చేప‌ట్ట‌వ‌చ్చు.

కొబ్బరి చెట్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువులు వేయాలి. ఎర్ర చీమలు, పురుగుల నుంచి రక్షణ అవసరం. మొదటి రెండేళ్లు ప్రత్యేక శ్రద్ధ అవసరం. మంచి నర్సరీ నుంచి మొక్కలు కొనాలి. సరైన సంరక్షణ ఉంటే చెట్లు 30 నుంచి 40 సంవత్సరాలు ఆదాయం ఇస్తాయి.

గమనిక: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వ్యాపారాన్ని మొదుల పెట్టే ముందు అంతకు ముందు ఈ రంగంలో ఉన్నవారిని నేరుగా సంప్రదించడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories