బిజినెస్ ఐడియా: 365 రోజులు డిమాండ్ ఉండే, నష్టం లేని వ్యాపారం. నెలకు ఎంత సంపాదనో తెలుసా..

First Published Sep 8, 2022, 12:04 PM IST

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే వ్యవసాయం కూడా అగ్రికల్చర్ బిజినెస్ ఉత్తమం అనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే మీకు ఏ బాస్ ఉండడు. కష్టంతో పాటు తెలివి తేటలు వాడితే చాలు మీరు చక్కటి వ్యాపార అవకాశం పొందవచ్చు. ఇందుకోసం మీరు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు.

రైతుల వద్దనుంచి పంటలను కొని ప్రజలకు అమ్మడం ద్వారా కూడా చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు. అయితే ఇందుకోసం మీరు షాపు పెట్టుకోవాల్సిన అసవరం లేదు. ఒక కమర్షియల్ మినీ ట్రక్ ఉంటే చాలు మీరు చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు. ఉదాహరణకు చాలా గ్రామాల్లో కూరగాయలను పండించిన వాటిని మార్కెట్లో విక్రయించడం, రైతులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఎందుకంటే ఓ వైపు పొలంలో పనిచేసి, మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం రైతులకు చాలా కష్టమైన పని అనే చెప్పాలి..

దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. మీరు నిరుద్యోగి అయితే, వెంటనే ఈ వ్యాపారం ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా మార్కెట్లోని మినీ ట్రక్ ను కొనుగోలు చేసుకోండి. వీటి ధరలు సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ఉన్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలు, లేదా బ్యాంకులు అందిస్తున్న ఆటో రుణంతో కమర్షియల్ వెహికిల్ కొనుగోలు చేసుకోవచ్చు. వీటికి అతి తక్కువ డౌన్ పేమెంట్ తో పాటుగా, ప్రతి నెల వాయిదాలు కట్టడం ద్వారా వాహనం మీ సొంతం అవుతుంది. 

ఇక వాహనం కొనుగోలు చేసిన తర్వాత మీరు, స్థానికంగా పట్టణం దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాల్లోని కూరగాయలు, పండ్లు పండించే రైతుల నుంచి కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చు. వ్యవసాయ క్షేత్రంలో మీరు కొనుగోలు చేసే కూరగాయల ధరలకు, మార్కెట్లో విక్రయించే ధరలకు చాలా తేడా ఉంటుంది. రైతుల వద్ద మీరు టోకుగా కూరగాయలను కొనుగోలు చేస్తే ధర తక్కువ పడుతుంది. ఆతర్వాత మీరు చిల్లరగా అమ్మితే మీకు చాలా లాభం వస్తుంది. 

రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కూరగాయలను మీరు పట్టణాల్లో ట్రక్ ద్వారానే విక్రయించవచ్చు. ప్రతీ కాలనీలోనూ వీకెండ్ సంతలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మీరు మీ ట్రక్కు ద్వారానే కూరగాయలను విక్రయించి లాభం పొందవచ్చు. వారంలో ప్రతి రోజు ఏదో ఒక కాలనీలో ఈ వీకెండ్ సంతలను ఏర్పాటు చేస్తారు. అక్కడకు వెళ్లి విక్రయించడం వల్ల మీకు వారంలో ఏడు రోజులు విక్రయించే వీలు కలుగుతుంది. లేదంటే స్థానిక వ్యాపారలుకు కూడా కూరగాయలను విక్రయించవచ్చు.

డీజిల్ ఖర్చు పోనూ మీ లాభం మార్జిన్ నిర్ణయించుకోవాలి. అయితే కూరగాయలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. రెస్టారెంట్లు, హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టళ్లు, అలాగే మారెట్లకు నిరంతరం కూరగాయలు కావాలి. అందువల్ల ఇందులో నష్టపోయే చాన్సులు తక్కువగా ఉంటాయి. మరొకటి ఈ వ్యాపారంలో మీరు కూరగాయలు విక్రయించేందుకు షాపు అవసరం లేదు. నేరుగా వినియోగ దారులకు విక్రయించడం వల్ల మీకు కచ్చితంగా లాభం వస్తుంది. కూరగాయలతో పాటు, సీజనల్ పండ్లను కూడా విక్రయిస్తే మరింత లాభం దక్కే చాన్స్ ఉంది. మీ చేతిలోవాహనం ఉండటం వల్ల, మీ సరుకును ఎక్కడ అవసరం అయితే అక్కడకు సులభంగా చేర్చి విక్రయించే చాన్స్ ఉంది. సరుకు చెడిపోతుందనే బాధ ఉండదు.   

click me!