BSNL : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ... ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు రెక్కలు వచ్చాయి. ఇంతకాలం ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడలేకపోయింది బిఎస్ఎన్ఎల్... కానీ ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారడంతో జోరు పెచింది. ప్రైవేట్ సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటివి రిచార్జ్ ప్లాన్స్ అమాంతం పెంచి ఒక్కసారిగా కస్టమర్లపై భారం మోపాయి. దీంతో చాలామంది సదరు ప్రైవేట్ టెలికాం సంస్థల నుండి బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు.
బిఎస్ఎన్ఎల్ 4G, 5G వంటి టెక్నాలజీ అప్ డేట్ విషయంలో వెనకబడి వుండవచ్చు... కానీ ఎప్పుడూ బడ్జెట్ ప్రెండ్లీ ధరలకే వినియోగదారులకు సేవలు అందించింది. దీంతో ఆ సంస్థపై ప్రజల్లో సాప్ట్ కార్నర్ వుంది. ఇదే ప్రైవేట్ సంస్థలు ఇంత గట్టిగా పోటీనిచ్చినా బిఎస్ఎన్ఎల్ ను నిలబెట్టాయి.