10. తికారియా/జైపూర్ టోల్ ప్లాజా: రాజస్థాన్‌లోని తికారియా-జైపూర్ టోల్ ప్లాజా ఆ దారిలో ప్రయాణించే వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తోంది. ఐదేళ్లలో ఇక్కడ వసూలు చేసిన టోల్ 1161.2 కోట్ల రూపాయలు.
9. కృష్ణగిరి తోపూర్ టోల్ ప్లాజా: తమిళనాడులోని ధర్మపురిలో ఉన్న ఈ టోల్ ప్లాజా ఉంది. దీన్ని పాళయం టోల్ ప్లాజా అని కూడా అంటారు. ఇది తమిళనాడులోని కృష్ణగిరి-తుంబయిపడి మధ్య 154 కి.మీ. పరిధిలో రోడ్డు టాక్స్ వసూలు చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడ వసూలు చేసిన టోల్ మొత్తం విలువ 1124.2 కోట్ల రూపాయలు.
8. ఘరౌండా టోల్ ప్లాజా: హర్యానాలోని ఘరౌండా ప్రాంతంలో ఈ టోల్ ప్లాజా ఉంది. 111.5 కి.మీ పానిపట్-జలంధర్ హైవేపై ఉంది. ఐదేళ్లలో ఇక్కడ చేసిన వసూళ్లు రూ.1314.4 కోట్లు.
7. చోర్యాసి టోల్ ప్లాజా: గుజరాత్‌లోని చోర్యాసి టోల్ ప్లాజా భరూచ్, సూరత్ పట్టణాల మధ్య ఉంది. 246 కిలోమీటర్ల దూరానికి ఈ టోల్ ప్లాజా పన్ను వసూలు చేస్తుంది. అయిదేళ్లలో 1,272.6 కోట్ల రూపాయలు వసూలయ్యాయి.
6. జలధులగోరి టోల్ ప్లాజా: పశ్చిమ బెంగాల్‌లోని జలధులగోరి టోల్ ప్లాజాకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది కేవలం 35 కిలోమీటర్ల పరిధికే టోల్ వసూలు చేస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. గత ఐదేళ్ల నుండి 1538.9 కోట్లు వసూలు చేసింది.
5. బరాజోర్ టోల్ ప్లాజా: ఇది ఉత్తరప్రదేశ్‌లోని బరాజోర్ ప్రాంతంలో ఉన్న టోల్ ప్లాజా ఇది. ఇటావా పట్టణాన్ని చకేరీకి కనెక్ట్ చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడ నుంచి 1480.7 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.
4. షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా: షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా రాజస్థాన్‌లోని గుర్గావ్-కోటాపుట్లీ-జైపూర్ మధ్య ఉంది. 115 కి.మీ.ల దూరానికి గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన టోల్ మొత్తం 1884.5 కోట్ల రూపాయలు.
3. నవాబ్‌గంజ్ టోల్ ప్లాజా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నవాబ్‌గంజ్ టోల్ ప్లాజా అత్యధిక వసూళ్లు చేస్తూ జాబితాలో నిలిచింది. ఐదేళ్లలో ఇక్కడి టోల్ ప్లాజా నుంచి రూ.1884.5 కోట్లు వసూలు చేశారు.
2. ససారం టోల్ ప్లాజా: ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. వారణాసి-ఔరంగాబాద్ మార్గంలో 94 కి.మీల పరిధిలో రోడ్డు పన్ను వసూలు చేస్తుంది. గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన సొమ్ము అక్షరాలా 2043.8 కోట్ల రూపాయలు.
1. బెర్తానా టోల్ ప్లాజా: ఈ టోల్ ప్లాజా గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఇక్కడి నుంచి వసూలు చేసిన మొత్తం అక్షరాల 2043.8 కోట్ల రూపాయలు.