ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత రూ.3.5 కోట్లు మీవే..

First Published | Aug 10, 2024, 6:33 PM IST

ప్రతి నెల కొద్దిగా డబ్బు దాచుకోవడం ద్వారా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు పొందుతారు. అయితే ఆ అమౌంట్ రూ.కోట్లలో ఉండాలంటే మీరు ఈ పొదుపు సూత్రాలు పాటించాలి. ఆ వివరాలు తెలుసుకోవాలంటే కింద సమాచారం మొత్తం చదవండి..

ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీల కోసం నిరంతరం కష్టపడతారు. వచ్చిన జీతంతో కుటుంబ అవసరాలు, బాధ్యతలు నెరవేరుస్తూ గడిపేస్తారు.  రిటైర్మెంట్ అయిన తర్వాత మాత్రమే విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి కల్పించిన సదుపాయమే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకం(EPFO). ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎక్కువ మొత్తంలో.. అంటే రూ. కోట్లలో నగదు పొందాలంటే ప్రతి నెల కొద్దిగా కొద్దిగా ఆదా చేయాలి. 

58 సంవత్సరాలు నిండిన తర్వాతే పెన్షన్..

ప్రభుత్వ సహకారంలో ఉద్యోగులు, వారి యజమానులు ప్రతి నెలా ​​ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పథకానికి(EPFO) కొంత నగదు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ పొందడానికి వీలుంటుంది. అలాా కాకుండా EPFO పథకం కింద ముందస్తు పెన్షన్ పొందాలంటే సభ్యుడు కనీసం 50 సంవత్సరాల వయస్సు నిండాలి. EPF ప్రయోజనాలను పొందాలంటే ఒక సంస్థలో కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి నెలకు కనీసం 1800 రూపాయలు చెల్లించాలి. 


ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం..

ప్రతి సంవత్సరం EPF వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం, EPFO ​​సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈపీఎఫ్ ఆర్థికంగా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక వ్యక్తి 58 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్‌కు అర్హులవుతారు. అయితే, EPFO ​​సభ్యులు తమ పెన్షన్‌ను రెండేళ్లపాటు వాయిదా వేస్తే, ప్రతి సంవత్సరం వారు 4 శాతం అదనంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. 
 

రూ.1.5 కోట్లు పొందాలంటే..

పదవీ విరమణ తర్వాత రూ.1.5 కోట్లు పొందాలంటే ఉద్యోగి జీతం నుంచి నెలకు  రూ.6,400 పొదుపు చేయాలి.  ఇలా 35 ఏళ్ల పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం ప్రకారం మొత్తం రూ. 1,51,47,472.81 పొందుతారు.

రూ.2.5 కోట్లు పొందాలంటే..
రిటైర్మెంట్ తర్వాత రూ.2.5 కోట్లు పొందాలంటే నెలకు రూ.10,600 నెలవారీ వేతనం నుంచి 35 ఏళ్లపాటు మినహాయించాలి. ఆ తర్వాత, ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం ప్రకారం మొత్తం రూ. 2,50,88,001.8 పొందుతారు.

రూ.3.5 కోట్లు పొందాలంటే.. 
పదవీ విరమణ తర్వాత రూ.3.5 కోట్లు పొందేందుకు నెలకు రూ.12,500 జీతం నుంచి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా 35 ఏళ్లపాటు చేస్తే 
వడ్డీ రేటు 8.25 శాతం ప్రకారం మొత్తం రూ. 3,50,05,925.84 మీ సొంతమవుతాయి. 

Latest Videos

click me!