BSNL BiTV: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్!

Published : Jan 31, 2025, 10:33 PM IST

BSNL BiTV: మీరు BSNL సిమ్ వాడుతున్నారా? అయితే మీ మొబైల్‌లో 400 కంటే ఎక్కువ టీవీ ఛానెల్స్, OTT ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం రండి. 

PREV
14
BSNL BiTV: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 450+ టీవీ ఛానెల్స్!

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు దీటుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. దీంతో చాలా మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పుడు BSNL భారతదేశంలోని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఇంటిగ్రేటర్ OTTplayతో కలిసి BSNL ఇంటర్‌టైన్‌మెంట్ (BiTV) అనే వినూత్న ఇంటర్నెట్ టెలివిజన్ సేవను ప్రారంభించింది. BSNL లైవ్ మొబైల్ టీవీ సేవ BiTV గత నెలలో పుదుచ్చేరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. 

24

ఇప్పుడు BiTV సేవను BSNL దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ సేవ దేశవ్యాప్తంగా ఉన్న BSNL మొబైల్ వినియోగదారులకు ప్రీమియంతో సహా 450 కంటే ఎక్కువ ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లకు ఉచితంగా అందిస్తుంది. దీని ద్వారా BSNL వినియోగదారులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్లలోనే 450 కంటే ఎక్కువ ఛానెల్‌లను ఉచితంగా చూడవచ్చు.

BSNL BiTV ద్వారా భక్తిఫ్లిక్స్, షార్ట్‌ఫండ్లీ, కాంచా లంకా, స్టేజ్, OM TV, Playflix, Fancode, Distro, Hubhopper, Runn TV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లతో పాటు 450 కంటే ఎక్కువ ప్రత్యక్ష టీవీ ఛానెల్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా చూడవచ్చు.

 

34

DTH సబ్‌స్క్రిప్షన్‌లు రోజురోజుకు తగ్గుతున్నాయి. అందువల్ల వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ప్రత్యక్ష ఛానెల్‌లను చూసేందుకు వీలుగా ఈ BiTV సేవను తీసుకువచ్చినట్లు BSNL తెలిపింది. BSNL సిమ్ కార్డ్ ఉన్నవారికి ఇది పూర్తిగా ఉచితం అని అధికారికంగా ప్రకటించారు.

''BiTV సేవ BSNL డిజిటల్ కంటెంట్ పై నిబద్ధతకు నిదర్శనం. ఈ కొత్త సేవ ద్వారా విప్లవాత్మకమైన మొదటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో BSNL ఒకటిగా మారింది'' అని ఈ సేవ ప్రారంభోత్సవంలో BSNL CMD రాబర్ట్ జె రవి ఐటిఎస్ తెలిపారు.

44

ఇది కాకుండా అనేక రాష్ట్రాల్లోని దాని బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత IFTV సేవను BSNL ప్రారంభించింది. అదనపు ఖర్చులు లేదా సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండా 500 కంటే ఎక్కువ ప్రత్యక్ష టెలివిజన్ ఛానెల్‌లను చూసే వీలును ఈ IFTV సేవ కల్పిస్తుంది. ఈ సేవ ఇటీవల తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌, గుజరాత్ టెలికాం సర్కిల్‌లో ప్రారంభమైంది.

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన జియో, ఎయిర్‌టెల్: తగ్గిన రీఛార్జ్ ధరలు

click me!

Recommended Stories