Find Your Phone IMEI Number: మీ ఫోన్ IMEI నెంబర్ తెలుసా? ఇలా తెలుసుకోండి

Published : Jan 31, 2025, 05:26 PM IST

Find Your Phone IMEI Number: మీ ఫోన్ పోయిందని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ ఫోన్ IMEI నెంబర్ ఎంత అని. ఈ నెంబర్ మీ ఫోన్లో ఎక్కడ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

PREV
15
Find Your Phone IMEI Number: మీ ఫోన్ IMEI నెంబర్ తెలుసా? ఇలా తెలుసుకోండి

మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు ఫోన్ ప్యాక్ చేసిన బాక్స్ పైనే IMEI నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తో పనే ఉంటుందిలే అని చాలామంది దాన్ని పట్టించుకోరు. ఆ బాక్స్ ని కూడా ఎక్కడో పడేస్తారు. కానీ ఫోన్ తో వచ్చిన ఆ బాక్స్ పైనే మనం కొన్న కొత్త ఫోన్ కు సంబంధించిన చాలా వివరాలు ఉంటాయి. IMEIనెంబర్ తో పాటు ఫోన్ కాన్ఫిగరేషన్ దానిపైన ప్రింట్ చేసి ఉంటుంది. 

25

కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు ఫోన్ వారంటీని కూడా బాక్స్ పైన అతికించేస్తాయి. కానీ ఆ బాక్స్ అంత విలువైందని ఎవరు అనుకోరు. మరికొన్ని కంపెనీలు సెల్ ఫోన్ బ్యాటరీపై ఐఎంఈఐ నంబర్, ఫోన్ కాన్ఫిగరేషన్ తదితర వివరాలు రాస్తాయి. 

 

35

అనుకోకుండా మన ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా.. అయితే పోలీసులు ముందు అడిగే ప్రశ్న ఏంటంటే మీ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఏంటి అని. ఈ ఐఎంఈఐ నెంబర్ ఉంటే మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ట్రేస్ చేసి పట్టుకోడానికి అవకాశం ఉంటుంది. 
 

45

మీరు ఐఎంఈఐ నెంబర్ ని ఎక్కడా సేవ్ చేసుకోకపోయినా పర్లేదు. అది మీ ఫోన్ లోనే ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మీ ఫోన్లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# అనే నెంబర్ టైప్ చేసి డయల్ చేయండి. 
వెంటనే మీకు IMEI నెంబర్, ICCID, MSISDN నంబర్లు కనిపిస్తుంది. 
దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. 
ఆ స్క్రీన్ షాట్ ని మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా షేర్ చేయండి. 
 

55

మీ మొబైల్ ను ఎవరైనా దొంగిలిస్తే వెంటనే ఈ ఐఎంఈఐ నెంబర్ ను పోలీసులకు ఇస్తే దీన్ని ఉపయోగించి మీ మొబైల్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి పోలీసులకు ఛాన్స్ ఉంటుంది.

click me!

Recommended Stories