BSNL నుంచి మీరు ఊహించలేని ఆఫర్: ఒక నెలంతా ఇంటర్నెట్ ఫ్రీ

First Published | Dec 25, 2024, 10:31 PM IST

BSNL తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఒక నెల మొత్తం ఉచితంగా ఇంటర్నెట్‌ అందిస్తోంది. ఈ ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 

BSNL బ్రాడ్‌బ్యాండ్ స్కీమ్

ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. BSNL దాని రెండు ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ స్కీమ్‌లతో ఒక నెల ఉచిత డేటాను అందిస్తోంది. ఈ ఉచిత డేటా పండుగ ఆఫర్ కింద వినియోగదారులకు అందిస్తున్నారు. BSNL ఈ రెండు స్కీమ్ ల ధర 500 రూపాయల కంటే తక్కువగానే ఉంది.

BSNL పండుగ ఆఫర్ వివరాలు

BSNL దాని ఫైబర్ బేసిక్ నియో, ఫైబర్ బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ స్కీమ్ లతో ఒక నెల ఉచిత డేటాను అందిస్తోంది. కానీ కండీషన్ ఏంటంటే.. కనీసం 3 నెలలకు ఈ ప్లాన్ తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే.. BSNL అందిస్తున్న ఈ పండుగ ఆఫర్ డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే డిసెంబర్ 31 లోపు ఈ ప్లాన్ లను ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవాలి. 


BSNL ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ పథకాలు

BSNL కేవలం 449 రూపాయలకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అందిస్తోంది. దీని పేరు ఫైబర్ బేసిక్ నియో ప్లాన్. ఇందులో వినియోగదారులు 30Mbps వేగంతో నెలకు 3.3 TB అంటే 3300 GB డేటాను పొందుతారు. అంటే మీరు రోజుకు 100 GB కంటే ఎక్కువ డేటాను ఉపయోగించుకోవచ్చు. 3300 GB డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 4 Mbps కి తగ్గుతుంది. దీనితో పాటు ప్లాన్ లో అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ మీరు చేసుకోవచ్చు. ఈ పథకంలో 3 నెలలకు రీఛార్జ్ చేస్తే 50 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది.

BSNL ఫైబర్ బేసిక్ రూ.499 పథకం ప్రయోజనాలు

BSNL రూ.499 ప్లాన్ ని ఫైబర్ బేసిక్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లాన్ 50 Mbps డేటా వేగాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ 3.3 TB వరకు డేటా లేదా 3300 GB నెలవారీ డేటాని మీకు అందిస్తుంది. FUP ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 4 Mbps కి తగ్గుతుంది. ఈ ప్లాన్ లో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా వినియోగదారులు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఈ ప్లాన్ లో 3 నెలలకు రీఛార్జ్ చేస్తే 100 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

Latest Videos

click me!