బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న కార్లు అంత స్పెషలా?

First Published | Dec 25, 2024, 8:17 PM IST

మీరు గమనించి ఉంటే మనకు ఎక్కువగా తెలుపు, పసుపు నంబర్ ప్లేట్లు ఉన్న కార్లు కనిపిస్తుంటాయి. ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్స్ కి గ్రీన్ కలర్ నంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. కాని నీలం రంగులో ఉండే నంబర్ ప్లేట్ ఉన్న కార్లను ఎప్పుడైనా చూశారా? బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఎవరి వెహికల్స్ కేటాయిస్తారో తెలుసుకుందాం రండి. 

రోడ్డుపై వెళుతుంటే మనకు రకరకాల నంబర్ ప్లేట్లుతో ప్రయాణించే వాహనాలు కనిపిస్తుంటాయి కదా? వాటిల్లో సామాన్యుల కార్లకు తెలుపు రంగు నంబర్ ప్లేట్ కేటాయిస్తారు. వాణిజ్య వాహనాలకు అంటే వ్యాపారానికి ఉపయోగించే వెహికల్స్ కి పసుపు, నలుపు రంగు ప్లేట్లు ఉంటాయి. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. అందుకే ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు, ఇటీవల బస్సులు కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. మరి ఆ వాహనాలకు ఆకుపచ్చ రంగు ఉన్న నంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. 

ఇలా తెలుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ రంగులున్న నంబర్ ప్లేట్ల వాహనాలే కాకుండా నీలం రంగు నంబర్ ప్లేట్ ఉండే వెహికల్స్ కూడా ఉన్నాయి. మరి ఇండియాలో ఏ వాహనాలకు ఈ నీలం నంబర్ ప్లేట్ ఇస్తారో తెలుసుకుందాం. అసలు బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఎందుకు తయారు చేశారో ఇక్కడ తెలుసుకుందాం.


నీలం నంబర్ ప్లేట్ ఉన్న కార్లను విదేశీ రాయబార కార్యాలయాలు లేదా దౌత్య అధికారులకు ఉపయోగిస్తారు. అంటే విదేశీ రాయబారులు, సిబ్బంది ఉపయోగించే వాహనాలు ఈ నీలం నంబర్ ప్లేట్ ని కలిగి ఉంటాయి.

తెలుపు, పసుపు రంగు నంబరు ప్లేట్లపై నంబర్లు నలుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ఆకుపచ్చ రంగులో ఉండే ప్లేట్ పై నంబర్లు తెలుపు రంగులో ఉంటాయి. మరి నీలం నంబర్ ప్లేట్లపై అక్షరాలు, నంబర్లు తెలుపు రంగులో ఉంటాయి. ఆ నంబరులో దేశం, సంస్థ కోడ్, అధికారి లేదా యజమాని ర్యాంక్ కోడ్ ఉంటుంది.

వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు ఇచ్చే అధికారాన్ని బట్టి ఇలాంటి రంగు రంగుల నంబర్ ప్లేట్లు కేటాయిస్తారు. బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు విదేశీ రాయబార కార్యాలయానికి పనిచేస్తాయి కాబట్టి అవి అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తాయి. వీటికి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రత్యేక భద్రత, ట్రాఫిక్ నిబంధనల్లో సడలింపులు కూడా లభిస్తాయి. బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు ఎక్కువగా ఢిల్లీ, మెట్రో నగరాల్లో కనిపిస్తాయి.

Latest Videos

click me!